BigTV English

Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ అనౌన్స్… బెస్ట్ మూవీ దేనికంటే..?

Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ అనౌన్స్… బెస్ట్ మూవీ దేనికంటే..?

Gaddar Awards :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ (Jayasudha) తాజాగా ప్రకటించారు. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు (Dilraju)తో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో ఆమె ఎవరికి ఏ విభాగంలో అవార్డు వచ్చింది అనే విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా.. వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించడం జరిగింది. ఇకపోతే దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. మొత్తం 11 కేటగిరీలలో వీటిని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి గానూ..ఈ సంవత్సరాల కాలంలో సెన్సార్ పూర్తి అయిన చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇక 2024 కి సంబంధించి అన్ని కేటగిరీలో కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇకపోతే తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా ఈ అవార్డులలో ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహ మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇవ్వడం జరిగింది. గద్దర్ అవార్డ్స్ లో భాగంగా ఎవరికి ఏ విభాగంలో అవార్డు వచ్చిందనే విషయానికి వస్తే..


ఉత్తమ మొదటి చిత్రం – కల్కి

ఉత్తమ రెండవ చిత్రం – పొట్టేలు


ఉత్తమ మూడవ చిత్రం – లక్కీ భాస్కర్

ఉత్తమ హీరో – అల్లు అర్జున్ (పుష్ప)

ఉత్తమ నటి – నివేధ థామస్ (35)

బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (కల్కి)

ఉత్తమ హస్య నటులు – వెన్నల కిషోర్, సత్య

బెస్ట్ కొరియోగాఫ్రర్ – గణేష్ ఆచార్య (దేవర)

గద్దర్ అవార్స్ ఫుల్ లిస్ట్ :

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్స్:

ఉత్తమ మొదటి చిత్రం – కల్కి

ఉత్తమ రెండవ చిత్రం – పొట్టేలు

ఉత్తమ మూడవ చిత్రం – లక్కీ భాస్కర్

జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి విభాగంలో తెరకెక్కిన చలనచిత్రాలలో ఉత్తమ చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా నిలిచింది.

ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు

ఉత్తమ హిస్టారికల్ మూవీ – రజాకార్

ఉత్తమ నూతన దర్శకుడు – శ్రీ యదువంశీ (కమిటీ కుర్రోళ్ళు)

ఉత్తమ ప్రజాధారణ చిత్రం – ఆయ్.. మేం ఫ్రెండ్స్ అండి

ఉత్తమ నటీనటులు..

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప 2)

ఉత్తమ నటి – నివేతా థామస్ ( 35 చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు – ఎస్. జే.సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి – శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)

ఉత్తమ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా -2)

ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ – అరుణ్ దేవ్ పోతుల, హారిక (35 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్)

ఉత్తమ టెక్నీషియన్స్..

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : బీమ్స్ సిసిరోలియో (రజాకార్)

ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సిద్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన – నిజమే నే చెబుతున్న)

ఉత్తమ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ -శ్రేయ ఘోషల్ (పుష్ప2 – సూసేకి అగ్గి రవ్వ మాదిరి)

ఉత్తమ రచయిత – శ్రీ శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్ )

ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ (రాజు యాదవ్ )

ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – విశ్వనాథ్ రెడ్డి (గామి )

ఉత్తమ ఆడియోగ్రాఫర్ – అరవింద్ మీనన్ (గామి )

ఉత్తమ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్)

ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య( దేవర- ఆయుధ పూజ )

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – అద్నితిన్ జిహాని చౌదరి (కల్కి 2898 ఏడి )

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టార్)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శ్రీను (రజాకర్)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి 2898AD)

స్పెషల్ జ్యూరీ అవార్డు 1 : దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్ )

స్పెషల్ జ్యూరీ అవార్డు 2: అనన్య నాగళ్ళ (పొట్టేలు )

స్పెషల్ జ్యూరీ అవార్డు 3: సుజిత్ అండ్ సాయి సందీప్ (క )

స్పెషల్ జ్యూరీ అవార్డు 4: ప్రశాంత్ రెడ్డి ,రాజేష్ కల్లేపల్లి (రాజు యాదవ్ )

జ్యూరీ స్పెషల్ మెన్షన్ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2 -స్పెషల్ సాంగ్ )

ALSO READ:HBD Singer Usha: సింగర్ ఉష గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×