Bollywood : ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు మరణిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలను విడిచారు.. తాజాగా మరో బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మరణించారు.. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలింది. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ రోనో ముఖర్జీ.. ఎన్నో హిట్ సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులకు అందించిన ఈయన తాజాగా గుండెపోటుతో మరణించారు. ఆయన నివాసంలోనే గుండెపోటు కారణంగా మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. హైవాన్, తు హి మేరీ జిందగీ వంటి హిట్ సినిమాలు కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రాణి ముఖర్జీకి ఈయన బంధువులు. ఇటీవలే ఈయన సోదరుడు దేబ్ ముఖర్జీ మరణించిన విషయం తెలిసిందే.. ఆయన చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఈయన చనిపోవడంతో ఆ కుటుంబానికి తీరని లోటుగా మిగిలింది. ప్రస్తుతం ఈయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు..
కాజోల్, రాణి ముఖర్జీ చిన్నాన్న రోనో ముఖర్జీ మరణం..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లయినా కాజోల్, రాణి ముఖర్జీలు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వీరి చిన్నాన్న, ప్రముఖ దర్శకుడు రోనో ముఖర్జీ కన్నుమూశారు. ఆయన నటి శర్బానీ ముఖర్జీకి తండ్రి. మరోవైపు కాజోల్, రాణీ ముఖర్జీ, అయాన్ ముఖర్జీ, తునిషా ముఖర్జీలకు చిన్నాన్న. శర్బానీతో పాటు ప్రముఖులు రోనో ముఖర్జీకి నివాళులర్పించారు.. కాజోల్ ప్రస్తుతం ది మామ్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నేపథ్యంలోలో ఆమె బాబాయ్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ గా రోనో తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి కూడా. ఇండస్ట్రీలో ఒక లెజండరీ డైరెక్టర్ మరణించడంతో తీరని లోటు ఏర్పడింది.. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..
Also Read :హృతిక్ రోషన్ – హోంబలే ఫీలిమ్స్ మూవీ.. డైరెక్టర్ గా స్టార్ హీరో..?
రోనో ముఖర్జీ..
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రోనో ముఖర్జీ గతంలో ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే గుండె కారణంగానే ఆయన చనిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు తెలిపారు..మార్చి 14న అయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ చనిపోయారు. ఆ దుఃఖం నుంచి ఇంకా తేరుకోకముందే రోనో మరణం వారి కుటుంబాన్ని మరింత శోకసంద్రంలో ముంచెత్తింది.