Manchu Lakshmi: మంచు లక్ష్మి(Manchu Lakshmi).. మోహన్ బాబు (Mohan babu) కూతురు అయినప్పటికీ తన లాంగ్వేజ్ తోనే ఎక్కువ ఫేమస్ అయింది. లేటు వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆమెకు ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలలో నటించినప్పటికీ, అవి అంతంత మాత్రంగానే హిట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా మంచు లక్ష్మి హైదరాబాద్ నుండి ముంబైకి మకాం మార్చేసింది. అయితే అలాంటి మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. ఆ హీరోయిన్ ను చూశాక నా పద్ధతి పూర్తిగా మార్చుకున్నాను అంటూ ఆసక్తికర కామెంట్లు చేసింది. మరి ఇంతకీ మంచు లక్ష్మి ఏ హీరోయిన్ ని చూసి ఇన్స్పైర్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం..
టాక్ షోకి హోస్ట్గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి..
మంచు లక్ష్మి బ్యూటీ విత్ లక్ష్మీ టాక్ అనే షోకి హోస్టుగా చేస్తోంది. ఈ షోకి హీరో సంజయ్ కపూర్ (Sanjay Kapoor) భార్య మహీరా కపూర్ గెస్ట్ గా వచ్చి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. ఈ నేపథ్యంలోనే నేను ఓ హీరోయిన్ ని చూసి.. నా మనసంతా మార్చుకున్నాను. అంటూ మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్లు చేసింది.ఇక మంచు లక్ష్మి మనసును మార్చేసిన ఆ హీరోయిన్ ఎవరో కాదు దివంగత నటి శ్రీదేవి (Sridevi).. చాలామంది హీరోయిన్ లు తమ ఫిట్నెస్ ని కాపాడుకోవడం కోసం జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. అలా శ్రీదేవి(Sridevi) బ్రతికున్న సమయంలో ఓ రోజు జిమ్ కి వెళ్లి థ్రెడ్ మిల్ మీద పరిగెత్తుతోందట.అయితే ఆ సమయంలో లక్ష్మి కూడా అదే జిమ్ కి వెళ్ళిందట.కానీ అక్కడే ఉన్న శ్రీదేవిని చూసి మంచు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట. ఎందుకంటే అంత పెద్ద హీరోయిన్ అయిన శ్రీదేవి తన జుట్టు నిండా నూనె పెట్టుకోవడాన్ని చూసి మంచు లక్ష్మి షాక్ అయిపోయిందట. ఎందుకంటే హీరోయిన్లు చాలా గ్లామర్ గా ఉంటారు.
శ్రీదేవిని చూసి మనసు మార్చుకున్నాను – మంచు లక్ష్మీ..
జుట్టుకు నూనె పెట్టుకోరు. కానీ అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ ఇలా జుట్టుకు నూనె పెట్టుకోవడం మంచు లక్ష్మి ఫస్ట్ టైం చూసి అసలు జిమ్ లోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచన చేసి డోర్ దగ్గరే ఆగిపోయిందట. దక్షిణ భారతదేశంలో చాలామంది తలకు నూనె పెట్టుకుంటారు.కానీ కొంతమందికి ఇష్టం ఉండదు.ముఖ్యంగా మంచు లక్ష్మికి తలకు నూనె పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదట. కానీ తలకు నూనె పెట్టుకున్న శ్రీదేవిని చూసి తన మనసు మార్చేసుకుందట. అంత పెద్ద హీరోయినే తలకి నూనె పెట్టుకోగాలేంది నేను పెట్టుకుంటే తప్పేంటి అని తన మనసు మార్చుకొని ప్రతిరోజు మంచు లక్ష్మి కూడా తలకు నూనె పెట్టుకునేదట. అయితే శ్రీదేవి ఎలా ఉన్న ఎక్కడ ఉన్నా కూడా చాలా సహజంగా ఉండడానికి ఇష్టపడేది అని, నేను పెద్ద హీరోయిన్ ని అనే గర్వం ఆమెలో ఉండేది కాదని.. ఎక్కడున్నా కూడా చాలా సింపుల్గా వ్యవహరించేది అంటూ చెప్పుకొచ్చింది. ఇక సంజయ్ కపూర్ భార్య మహీరా కపూర్ (Mahira Kapoor) మాట్లాడుతూ..”శ్రీదేవి ఎప్పుడు నాచురల్ గా ఉండడానికే ఇష్టపడుతుంది.ఎప్పుడు ఏం చేయాలో..ఎలా ప్రవర్తించాలి అనేది ఆమెకు బాగా తెలుసు” అంటూ చెప్పింది. ప్రస్తుతం బ్యూటీ విత్ లక్ష్మీ టాక్ షోలో శ్రీదేవి అందం గురించి మంచు లక్ష్మి, మహీరా కపూర్ లు మాట్లాడుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది..
Hero Nani: వైరల్ గా మారిన నాని ఆస్తుల విలువ.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారంటే..?