BigTV English
Advertisement

CM Revanth Reddy: ఇవి నిజమైతేనే మాకు ఓటు వేయండి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: ఇవి నిజమైతేనే మాకు ఓటు వేయండి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: బీఆర్ఎస్ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.


‘బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పని చేస్తోంది. అభ్యర్థులే దొరకని పరిస్థితిలో బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పేగు బంధం తెగిపోయింది.. ఇక ఫాంహౌస్ లో పడుకోమని ప్రజలు కేసీఆర్ కు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక ఐదారు నెలలు ఎన్నికల కోడ్ వల్ల పరిపాలన పూర్తిగా చేయలేదు. గత ఐదు నెలల నుంచి మాత్రమే సరైన పరిపాలన మొదలైంది. మా ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఉద్యోగాల నియామకాలు జరిగాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ALSO READ: CISF Recruitment: టెన్త్ అర్హతతో 1124 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?


‘మా ప్రభుత్వం వచ్చాక మాత్రమే ఉద్యోగ నియామకాలు జరిగాయి. 15 వేల మంది పోలీసు నియామకాలు చేపట్టాం. 6 వేల మందికి మెడికల్ ఉద్యోగాలు ఇచ్చాం. 55 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తున్నాం. టాటా కంపెనీతో మాట్లాడి ఐటీఐలను అప్ గ్రేడ్ చేశాం. యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నిరుద్యోగులను పట్టించుకోలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

‘సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చింది నిజమైతేనే. కాంగ్రెస్ కు ఓటు వేయండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కేసీఆర్ కాలంలో చేసిన అప్పులు మేమే కడుతున్నాం. ఇప్పుడిప్పుడే వ్యవస్థను దారిలోకి తేస్తున్నాం. కేసీఆర్ అదికారంలో ఉన్న పదేళ్లు ఉద్యోగులకు సరిగ్గా టైంకు జీతాలు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక టైంకి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఇద నిజమైతేనే ఓటు వేయండి’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ALSO READ: CSIR-CDRI Recruitment: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.81,000.. పూర్తి వివరాలివే..

‘నిజామాబాద్ కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 పోస్టు ఇచ్చాం. వరంగల్ కు చెందిన దీప్తికి గ్రూప్- 2 ఉద్యోగం ఇచ్చాం. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారు. పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారు. నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి. నిజామాబాద్ రైతులు పంజాబ్ రైతులతో పోటీపడి పంటలు పండిస్తారు. రైతు రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇచ్చాం. కేసీఆర్ సర్కారు చేసిన అప్పులకు ఇంత వరకు రూ.75 వేల కోట్ల వడ్డీ కట్టాం. నేను సీఎం అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన జీతం ఇస్తున్నాం. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ 8 వేల కోట్లు బకాయి పెట్టారు. రాబోయే రోజుల్లో నెలకు వెయ్యి కోట్ల చొప్పున చెల్లిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు.

‘బండి సంజయ్ బడా బీసీ అంటున్నాడు. మీరు పదేళ్ళలో కులగణన ఎందుకు చేయలేదు..? మీకోసం లెక్కలు తేల్చి నేను కొట్లాడుతున్నా. బలహీన వర్గాల లెక్కలు తప్పయితే ఆధారాలతో చూపండి. సొల్లు మాటలు వద్దు. గుజరాత్ లో 29 కులాల ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.  మాదిగ ఉప కులాల వర్గీకరణ చేసి చట్టసభల్లో ఆమోదించాం. మోదీ, కృష్ణ మాదిగను కౌగిలించుకున్నాడు కానీ వర్గీకరణ చేయలేదు. జర్నలిస్టుల సమస్యలు పట్టించుకుని పరిష్కరిస్తున్నాం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది బండి సంజయ్, కిషన్ రెడ్డే’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: Manager Jobs: డిగ్రీ అర్హతతో మేనేజర్ ఉద్యోగాలు.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

‘ఈ కార్ రేసులో కేటీఆర్ ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఎప్పుడు విదేశాల నుండి రప్పిస్తారు. బండి సంజయ్ శాఖ పనే కదా ఇది. వారు రాగానే బొక్కలో వేస్తాం. వారితో చీకటి ఒప్పందాలు చేసుకుని కాపాడుతున్నారు. కాగితాలు ఇచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేని బోడి పార్టీ ఉప ఎన్నికల్లో తడాఖా చూపిస్తారట. హైదరాబాద్ మెట్రోకు అనుమతి రాకుండా కేంద్రంలో కిషన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. మూసీ ప్రక్షాళనకు నిధులు రాకుండా అడ్డుకున్నారు. మాకు క్రెడిట్ వస్తదని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పట్టభద్రులు అండగా నిలబడండి. కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related News

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

Big Stories

×