Hero Nani:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. కష్టపడి నేడు స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు నాని (Nani). తన నటనతో ఎంతోమందిని అబ్బురపరుస్తూ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సినిమాలతో సత్తా చాటుతూ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఆయన డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh Kolanu)దర్శకత్వంలో ‘హిట్ 3’ అనే సినిమాతో 2025 మే 1న (కార్మికుల దినోత్సవం) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని విడుదల చేయగా అందులో మరో నానిని చూసి ఆడియన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే నాని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన అసలు పేరేంటి? హీరో కాకముందు ఏం చేసేవారు ? సినిమాల్లోకి ఎలా వచ్చారు? ప్రస్తుతం ఆయన ఆస్తులు విలువ ఎంత?అనే విషయాలు గురించి ఇప్పుడు చూద్దాం.
నాని అసలు పేరు..మొదటి రెమ్యూనరేషన్..
నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు..1984 ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా చల్లపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు హైదరాబాదులో సెటిల్ అవడంతో తన విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే సాగింది. హైదరాబాదులోని సెయింట్ అల్ఫోన్సా హై స్కూల్లో చదివిన ఈయన.. ఎస్ ఆర్ నగర్ లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత డైరెక్టర్ అవ్వాలని ఆసక్తితో, ఇండస్ట్రీకి వచ్చి.. డైరెక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. 2005లో వచ్చిన ‘రాధాగోపాలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, 4000 రూపాయలను మొదటి రెమ్యూనరేషన్ గా అందుకున్నారు..
ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు?
కే.రాఘవేంద్రరావు దగ్గర ‘అల్లరి బుల్లోడు’, శ్రీను వైట్ల దగ్గర ‘ ఢీ’ చిత్రాల కోసం పనిచేసిన నాని సొంతంగా స్క్రిప్ట్ రాసుకోవాలనే ఉద్దేశంతో కాస్త బ్రేక్ ఇచ్చారు. ఫ్రెండ్ సలహా మేరకు వరల్డ్ స్పేస్ శాటిలైట్ ఛానల్లో రేడియో జాకీగా చేరిన నాని.. ఆర్జేగా ఒక ఏడాది పాటు “నాన్ స్టాప్ నాని” అనే ప్రోగ్రాం చేశారు. ఆ సమయంలో నానికి అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘అష్టా చమ్మా ‘ సినిమాలో అవకాశం ఇచ్చారు. మొదట అవసరాల శ్రీనివాస్ పాత్రను ఆఫర్ చేసినా.. చివరికి హీరో పాత్ర ఇచ్చి అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
Also Read : బన్నీ సినిమాలకే అలా జరుగుతోందా.. ఆలస్యానికి కారణం..?
హీరో నాని ఆస్తుల విలువ..
ఒకవైపు హీరోగా చలామణి అవుతూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా భారీ పాపులారిటీ అందుకున్న నాని.. అటు తమిళ్ ఇటు తెలుగు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్నారు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 40 కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నానికి రియల్ ఎస్టేట్ మీద దృష్టి ఎక్కువగా ఉండడంతో సినిమాల ద్వారా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్లో పెట్టినట్లు సమాచారం. ఇక ఆ డబ్బు మూడింతలు పెరిగిందని, అందుకే ప్రస్తుతం నాని ఆస్తి విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. రూ.6 కోట్ల విలువైన కార్లు, రూ.2కోట్ల విలువైన యాక్సిసరీస్ లతోపాటు రూ.30 కోట్ల విలువైన ఫ్లాట్లు కూడా ఉన్నాయట. ప్రస్తుతం నానికి సంబంధించిన ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.