BigTV English

Manchu Lakshmi: ఆ సమయంలో చరణ్ ఇంట్లోనే సీక్రెట్ గా ఉన్నాను.. అతనికి తెలియని కూడా తెలియదు

Manchu Lakshmi: ఆ సమయంలో చరణ్ ఇంట్లోనే సీక్రెట్ గా  ఉన్నాను.. అతనికి తెలియని కూడా తెలియదు

Manchu Lakshmi: కలక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలు మంచి లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనగనగా ఒక ధీరుడు అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన లక్ష్మీ.. ఆ తరువాత వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా కాకపోయినా.. విలన్ గా, సపోర్టివ్ క్యారెక్టర్స్ లో అమ్మడు మెప్పించింది.


ఒకపక్క తల్లిగా.. ఇంకోపక్క నటిగా .. మరోపక్క సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే లక్ష్మీ.. ప్రస్తుతం ముంబైకి షిఫ్ట్ అయ్యిందన్న విషయం తెల్సిందే. ఇక ముంబైలో అడుగుపెట్టాకా.. అమ్మడు అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక మనసులో ఏది ఉంటే అదే బయటపెట్టడం లక్ష్మీకి ఉన్న నైజం. ఎవరు ఏమనుకుంటారు.. ? విమర్శలు వస్తాయిలాంటివి పట్టించుకోకుండా.. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్తుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ.. రామ్ చరణ్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చింది. చిన్నతనం నుంచి తాము కలిసి పెరిగామని, మా మధ్య కుటుంబ సభ్యులు అనే ఫీలే ఉంటుందని చెప్పుకొచ్చింది. ముంబైకి వచ్చిన కొత్తలో చరణ్ ఇంట్లోనే నివసించినట్లు తెలిపింది.


” ముంబైకి వచ్చిన కొత్తలో నాకు అపార్ట్మెంట్ దొరకలేదు. అప్పుడు చరణ్ కు కాల్ చేస్తే.. ముంబైలోని తన అపార్ట్మెంట్ తాళాలు ఇచ్చి.. ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎప్పుడు నాకు కాల్ చేయలేదు. ఆ ఇంట్లో నేను ఎన్ని రోజులు ఉన్నాను అనేది కూడా అతనికి తెలియదు. ఆ సమయంలో చరణ్ చేసిన సాయం చాలా గొప్పది. ఆ చరణ్ చాలా మంచివాడు.

ఇక ఈ విషయం ఇప్పటివరకు బయటపెట్టకపోవడానికి కారణం.. పుకార్లు. సెలబ్రిటీలు అనగానే ఏదో ఒకటి రాసేస్తారు. అందుకే నేను చెప్పలేదు.. చరణ్ కూడా ఈ విషయాన్నీ ఎక్కడా చెప్పడానికి ఇష్టపడలేదు. అసలు చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. ఇప్పుడు కూడా చరణ్ వ్యక్తిత్వం ఏంటి అనేది చెప్పడానికి రివీల్ చేశాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×