BigTV English

Manchu Lakshmi: వారిని నడిరోడ్డుపై నరకాలి.. మంచు లక్ష్మీ ఫైర్

Manchu Lakshmi: వారిని నడిరోడ్డుపై నరకాలి.. మంచు లక్ష్మీ ఫైర్

Manchu Lakshmi: ప్రణీత్ హన్మంతు వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. నెటిజన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా అతనిని వదిలేది లేదని, వదలకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఒక నలుగురు ఫ్రెండ్ తో ఒక పాడ్ కాస్ట్ లో తండ్రి కూతుళ్ళ మీమ్ పై నీచంగా, అసభ్యకరమైన పదజాలం వాడి డార్క్ కామెడీ చేశాడు ప్రణీత్.


ఇక ఈ విషయాన్నీ హీరో సాయి ధరమ్ తేజ్ ఒక పోస్ట్ ద్వారా ఖండించడంతో.. అతనికి ఇండస్ట్రీ మొత్తం తోడుగా నిలబడింది. చైల్డ్ అబ్యూస్ చేసినందుకు ప్రణీత్ కు, అతని ఫ్రెండ్స్ ను అరెస్ట్ చేయాలనీ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క తో పాటు పలు అధికారులు సైతం ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. ప్రణీత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన తప్పు అయ్యిందని అతడు వీడియో రిలీజ్ చేసినా కూడా ఇది ఆగడం లేదు. స్టార్ హీరోలు సైతం ఇలాంటి నీచుడును వదలకూడదని, కఠిన చర్యలు తీసుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ అయితే.. అమ్మతోడు.. నిన్ను వదలను అని ట్వీట్ చేశాడు.


ఇక తాజాగా ఇదే విషయమై మంచు లక్ష్మీ మీడియా ముందు మాట్లాడింది. ఒక ఈవెంట్ లో పాల్గొన్న మంచు లక్ష్మీకి ప్రణీత్ హన్మంతు గురించిన ప్రశ్న ఎదురవ్వగా ఆమె కూడా ఫైర్ అయ్యింది. ఇలాంటివారి నడిరోడ్డుపై నరికేయాలి అని చెప్పుకొచ్చింది.

“నాకు బాధ వేస్తుంది ముందు.. ఇంత నెగెటివిటీతో కూడా ఉన్నారా.. ? అని. రోటీ, కపడా, మకాన్ ఈ మూడు ఉంటే వాళ్లు ఇలా చేయరేమో అని. యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ చూసి మా అమ్మ నాకు కాల్ చేసి నువ్వెంటి ఇలా చేశావ్ అంట కదా అని అడుగుతుంది. నేను నీతోనే ఉన్నాను కదా అని చెప్తే.. అవును కదా మరి వాళ్లేంటి అలా రాశారు అంటే.. ఫస్ట్ నువ్వు చూడడం మానెయ్ అంటే.. అది కుదరదు. అందుకే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మొన్న నేను ఒక థంబ్ నెయిల్ చూసాను. లక్ష్మీ మంచు ఎవరినో కొట్టింది అని ఉంది. నేను ఓపెన్ చేస్తే.. సినిమాకు క్లాప్ కొడుతున్న వీడియో ఉంది. స్లాప్ కు, క్లాప్ తేడా తెలియనివారితో ఏం మాట్లాడాలి. చైల్డ్ అబ్యూస్ చేసిన వారికి అడ్డంగా నరకాలి, నడిరోడ్డుపై నరకాలి అనేది నా ఉద్దేశ్యం.

వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు చూసాను.. 600 మంది ఆడవారికి ఒక పోలీస్ అంట.. ఒకేసారి 6000 మంది వస్తే ఏంటి పొజిషన్. ఇలా తప్పు చేసినవారు ఆవును తిన్నారనో, హిజాబ్ వేసుకున్నారనో.. ఎవరు ఒక మతాన్ని సపోర్ట్ చేస్తున్నారనో బాధపడకండి.. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే బాధపడాలని నేను అంటున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×