BigTV English

Manchu Manoj: నారా రోహిత్ పై కంప్లైంట్.. చంద్రబాబు ఇంటి ముందు ధర్నా.. మంచు మనోజ్ ఏంటయ్యా ఈ గోల

Manchu Manoj: నారా రోహిత్ పై కంప్లైంట్.. చంద్రబాబు ఇంటి ముందు ధర్నా.. మంచు మనోజ్ ఏంటయ్యా ఈ గోల

Manchu Manoj: నారా రోహిత్,మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు కలిసి నటిస్తున్న తాజా మూవీ బైరవం.. విజయ్ కనకమెడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి బ్యానర్ పై కేకే రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమిళంలో విడుదలై హిట్ కొట్టిన గరుడన్ మూవీకి రీమేక్ గా తెలుగులో భైరవం సినిమాని చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా మే 30న రిలీజ్ కి సిద్ధమైంది. అయితే మే 30న విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా రిలీజ్ అవుతుందని ప్రకటించారు.కానీ ఆ తర్వాత కింగ్డమ్ మూవీని వాయిదా వేయడంతో బైరవం సినిమాకి లైన్ క్లియర్ అయినట్టు అయింది.ఇక చాలా రోజులుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్, నారా రోహిత్ లకి ఒక్క హిట్ కూడా లేదు.


భైరవం.. చీఫ్ గెస్ట్ ఎవరు.?

దాంతో ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు కాబట్టి భైరవం మూవీ హిట్ అయితే గనుక ఈ ముగ్గురు హీరోలకి మార్కెట్ పెరుగుతుంది. అయితే మే 30న రిలీజ్ కాబోతున్న భైరవం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ముగ్గురు హీరోలు. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఒకరిపై ఒకరు ప్రశ్నలు జోకులు వేసుకుంటూ ఆధ్యాంతం నవ్వులు పూయించారు. ఇంటర్వ్యూ లో మంచు మనోజ్,నారా రోహిత్ ని ప్రశ్నలతో ఇరుకున పెట్టేశారు. నారా లోకేష్ ఇష్టమా నేను ఇష్టమా అని రోహిత్ ని అడిగారు. మరి ఆ ప్రశ్నకి రోహిత్ ఏమని సమాధానం ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.. మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్,నారా రోహిత్ ముగ్గురు తాజాగా బైరవం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్,రోహిత్ మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
ఇందులో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మన సినిమాకి చీఫ్ గెస్ట్ గా ఎవర్ని పిలుద్దామని అడుగుతారు.


రోహిత్ ను ఆటపట్టించిన మనోజ్..

దానికి మనోజ్ రోహిత్ ని చూస్తూ సీఎం గారిని పిలిచేయ్ అని అంటారు.దానికి రోహిత్ ఆయన చాలా బిజీగా ఉంటారని ఆన్సర్ ఇచ్చారు.ఆ తర్వాత డిప్యూటీ సీఎం పిలవండి అని మనోజ్ అనగా ఆయన్ని మరో సినిమాకి పిలుద్దాం అన్నట్లుగా రోహిత్ ఆన్సర్ ఇచ్చారు. ఆయన కూడా బిజీగానే ఉంటారు అని మనోజ్ చెప్పారు.ఆ తర్వాత మరి మీ బ్రదర్ లోకేష్ ని అని మనోజ్ అడగగా.. ఏమో అన్నయ్యని ఒకసారి కనుక్కోవాలి అంటూ రోహిత్ చెప్పారు. ఆ తర్వాత మనోజ్ నీకు మీ బ్రదర్ లోకేష్ ఇష్టమా.. నేను ఇష్టమా..అని అడగగా నాకు నా అన్నే ఇష్టం అని చెప్పారు.అన్న అంటే నేనే కదా.. అయినా నీకు నేను బావనవుతానా.. అన్ననవుతానా.. అని మనోజ్ అడగగా.. బావే అవుతావ్ అని రోహిత్ చెప్పారు.అలా ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ కి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Prabhakar : కొడుకుని ట్రోల్స్ చేశారని.. కూతురిని రంగంలోకి దించిన బుల్లితెర మెగాస్టార్..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×