Protein Foods Harmful| ఆరోగ్యమైన, బలమైన శరీరానికి ప్రోటీన్ ఒక ముఖ్యమైన పోషకం. సరైన మోతాదులో ప్రొటీన్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో కండరాల పెరుగుదల, దెబ్బతిన్న కండరాలు రిపేరుకు, బరువు పెరగడానికి, రోగనిరోధక శక్తి పనిచేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. అందుకే శరీరంలో ప్రొటీన్ లోపం ఉంటే వైద్యలు, పోషకాహార నిపుణులు మాంసం, చేపుల, కోడిగుడ్లు, పప్పు ధాన్యాలు, డ్రైఫ్రూట్స్ నట్స్, పాలు, పాల ఉత్పత్తులు లాంటివి తినాలని సూచిస్తున్నారు.
కానీ ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నీ కొందరి ఆరోగ్యానికి హానికరమని కూడా వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రత్యేకించి కొందరికి ఆరోగ్య సమస్యల కారణంగా ప్రొటీన్ ఎక్కువగా తినడం ప్రమాదకరం.
ప్రొటీన్ ఆహారం ఎప్పుడు హానికరంగా మారుతుందంటే?
కొన్ని తీవ్ర ఆరోగ్య సమస్యలున్నప్పుడూ ప్రొటీన్ తినడం ప్రమాదకరంగా మారుతుంది. వీటిలో ముందుగా
కిడ్నీల సమస్య: కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం లేదా అందులో రాళ్లు ఉన్నవాళ్లు ప్రొటీన్ ఫుడ్ తింటే దాన్ని జీర్ణం చేయడంలో వారికి కష్టమవుతుంది. ఈ సమస్యలున్నవారు ప్రొటీన్ ఎక్కువగా తింటే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కిడ్నీ సమస్య మరింత తీవ్రమవుతుంది.
యూరిక్ యాసిడ్ లెవెల్స్: మటన్, చేపలు, ఇతర సీఫుడ్ లాంటి హై ప్రొటీన్ ఫుడ్స్ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ శరీరంలో పెరిగిపోతే ఎముకలు, కీళ్లులో గౌట్ సమస్య, కిడ్నీలో రాళ్ల సమస్యలు వస్తాయి.
డయాబెటీస్, కిడ్నీ సమస్య: డయాబెటీస్ (మధుమేహం) ఉన్నవారు సాధారణంగా హై ప్రొటీన్ ఆహారం తీసుకోవడం మంచిది. దాని వల్ల బ్లడర్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. కానీ డయాబెటీస్ తో పాటు కిడ్నీ సమస్య ఉన్నవారు మాత్రం ప్రొటీన్ ఫుడ్ తినకూడదు.
Also Read: గ్రీన్ టీతో అద్భుతమైన ఫేస్ ప్యాక్స్.. మచ్చలులేని ముఖం మీ సొంతం
ప్రొటీన్ తినడం లేదా తినకపోవడం వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రొటీన్ ఎంత తినాలి, లేదా తినకూడదు అనే అంశంపై ఆరోగ్య సమస్యలున్నవారు తమ రెగులర్ వైద్యుడు లేదా డైటీషియన్ ద్వారా తెలుసుకోవాలి. అందుకే జీవనశైలి, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శద్ధ చూపాలి.
ప్రొటీన్ ఫుడ్స్ తక్కువగా తినమని వైద్యులు సూచనలు చేసినా అందులో కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయడం మంచింది. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ బర్డర్లు, నాన్ వెజ్ పిజ్జాలు, ఫ్రైడ్ చికెన్, ప్రాసెస్డ్ చీజ్, నాణ్యత లేని ప్రొటీన్ పౌడర్స్, లాంటివి తినడం మానుకోవాలి. వీటిలో యాడెడ్ షుగర్స్, అనారోగ్యకరమైన ఫ్యాట్స్, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.