Prabhakar: ప్రభాకర్ తెలుగు బుల్లితెరపై ఈటీవీ ప్రభాకర్ గా, యాహు ప్రభాకర్ గా, బుల్లితెర మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందారు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించారు. ఆయన తీసిన సీరియల్స్ అన్ని ఎంతో పాపులర్ అయ్యాయి. ఓ సామాన్య వ్యక్తి నుండి బుల్లితెర స్టార్ గా ఎదిగిన ప్రభాకర్. ప్రస్తుతం మాటీవీలో ఇంటింటి రామాయణం సీరియల్ లో,జి తెలుగు లో చామంతి లో, నటిస్తున్నారు. టీవీ ప్రోగ్రామ్స్ లోనూ పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. గ్రాండ్ ఫినాలే లో, నాలుగు సీరియస్ కి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. జడ్జిలుగా రోజా, మంచు లక్ష్మి, వ్యవహరిస్తున్నారు. అమ్మాయిగారు,చామంతి, పడమటి సంధ్యారాగం, జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్స్ పోటీ పడనున్నాయి. ఈ ఫైనల్ పోరులో, ప్రభాకర్ తన కూతురితో ఓ స్కిట్ లో పాల్గొంటారు. ఈ ప్రోమోలో ప్రభాకర్ తన కూతురితో, చేసిన స్కిట్ లో ఆయన తన కొడుకు గురించి వచ్చే ట్రోల్ కు సమాధానం ఇచ్చారు.
కొడుకుని ట్రోల్స్ చేశారని..
ప్రోమోలో.. ప్రభాకర్ కూతురు పుట్టిందని చాలా సంతోషంగా ఉంటాడు. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావ్ అమ్మ అంటే నేను డాక్టర్ని అవుతాను అని అంటుంది. నాకు నీలాగా యాక్టింగ్ చేయాలని కూడా ఉంది అని దివిజ అంటుంది. ఈమె హీరోయిన్ అవుతుందంట, వీళ్ళ అన్నయ్య వచ్చాడు. ట్రోల్ మొత్తం వాడే, ఇప్పుడు ఈవిడ కూడా వస్తుందిట చాలా టాలెంట్ ఉండాలి. అని అందరూ అనడంతో, నా వల్ల కావట్లేదు నాన్న అని ప్రభాకర్ తో చెబుతుంది. యాక్టర్ అయ్యి నీకు గొప్ప పేరు తెద్దాం అనుకున్నాను. అలాంటివాళ్లు అంటూనే ఉంటారు. ఇలాంటి మాటలకి వెనకడుగు వేస్తే ఇలాంటి మారని మనుషులకి, బానిసలు అయిపోతాము. నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలి. అని ప్రభాకర్ తన కూతుర్ని ఎంకరేజ్ చేస్తాడు. ఈ వీడియో చూసిన వారంతా కొడుకుని ట్రోల్ చేశారని కూతుర్ని రంగంలోకి దించిన బుల్లితెర మెగాస్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇద్దరు జడ్జిల గొడవ ..
ఈ ప్రోమోలో ప్రభాకర్ స్కిట్ చూసి, రోజా, ఇలానే మా జీవితంలో కూడా జరిగింది. మా ఇంట్లో నా కూతుర్ని ఎంకరేజ్ చేయడంలో, సెల్వ క్యారెక్టర్ కూడా అదే, అంటూ రోజ తెలిపారు. ఇదే ప్రోమోలో రోజా, మంచు లక్ష్మి కంటెస్టెంట్స్ తో గొడవపడి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ముందు మంచు లక్ష్మి కంటెస్టెంట్ సరిగా గేమ్ ప్లే చేయలేదని అనడంతో, గొడవ మొదలై ఇద్దరు జడ్జిలు వెళ్లిపోయినట్లుగా ప్రోమోలో చూపిస్తారు. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. ఈ నాలుగు సీరియల్స్ లో విజేతగా ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.. ప్రోమో చూసిన వారంతా ఫుల్ ఎపిసోడ్ కోసం వేచి చూస్తున్నారు.