Neeraj Chopra: భారత బల్లెం వీరుడు, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసాడు మన స్టార్. కానీ 90 మీటర్ల మార్కు సాధించిన నీరజ్‌కు నిరాశే మిగిలింది. 90.23 మీటర్ల దూరంతో బల్లెం విసిరినా రెండో స్థానానికే పరిమితమయ్యాడు.
నీరజ్ తొలి ప్రయత్నంలో 88.44 మీటర్ల మార్కుతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. తన రెండో ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. చివరి ప్రయత్నంలో 90.23 మీటర్లతో బల్లెం విసిరాడు. అప్పటికే జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ చివరి ప్రయత్నంలో 91.06 మీటర్ల ప్రదర్శనతో నీరజ్‌ను వెనక్కి నెట్టాడు. దీంతో మన నీరజ్ రెండో స్థానానికే పరిమితమయ్యాడు. మూడో స్థానంలో 85.64 మీటర్లతో అండర్సన్ పీటర్స్ నిలిచాడు.
2020 ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించాడు నీరజ్. లాస్ట్ టైమ్ పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గాడు. 2023లో నీరజ్ 88.17 మీటర్ల ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచాడు భారత స్టార్ నీరజ్ చోప్రా.
నీరజ్ చోప్రా కెరియర్
భారత్ అంటే క్రికెట్టే అని ఊహించుకునే అందరికీ.. మిగతా క్రీడల్లో కూడా భారతీయులు సమర్ధులు అని.. తెలియజేసిన క్రీడాకారుడు నీరజ్ చోప్రా.. టోక్యో 2020 లో భారత దేశానికి ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తూ.. 2019లో తన భుజానికి గాయమై.. డాక్టర్లు ఈ ఆటను మానేయమని చెప్పిన తన కల కోసం, దేశంపైన ప్రేమ కోసం 138 కోట్ల జనాభా తరుపున నిలబడి ఆగష్టు7, 2020న దేశ చరిత్రలో మర్చిపోలేని రోజుగా పసిడి పతకాన్ని సాధించాడు నీరజ్ చోప్రా.
నీరజ్ జావెలిన్ త్రో నే ఎందుకు ఎంచుకున్నాడు.
అసలు ఇన్ని ఆటలు ఉండగా.. నీరజ్ జావెలిన్‌త్రో నే ఎందుకు ఎంచుకున్నాడంటే.. నీరజ్ 13 ఏళ్ల వయసులోనో 90 కిలోల బరువు ఉండేవాడు. అందరూ ఎక్కిరించే వాళ్ళు. ఇది చూసిన నీరజ్ చోప్రా అంకుల్ బరువు తగ్గడానికి పానిపట్టు స్పోర్ట్ స్టేడియంలో నీరజ్ చోప్రాను చేర్పించాడు. ఇక్కడి నుంచే అతని ఆలోచనలన్ని మారిపోయాయి. నీరజ్ తొలి గురువు జై చౌదరి. జావెలిన్ త్రో గురించి అస్సలు తెలియని నీరజ్‌కి దానిపైన ఆసక్తి కలిగించేలా చేసింది ఈయనే. తొలిసారిగా తనకి జావెలిన్ ఇచ్చి విసరమంటే.. 35 మీటర్ల దాకా విసిరాడంటా.. అక్కడి నుంచి మొదలైన నీరజ్ చోప్రా ప్రయాణం తొలి భారత జావెలిన్ త్రోయర్‌గా రికార్డ్ సృష్టించేంత వరకు వచ్చింది.
నీరజ్ పథకాలు
2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్ షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నాడు నీరజ్ చోప్రా. ఇంకా 2016 తర్వాత నీరజ్ కెరియర్ మలుపు తిరిగింది. విజయాలు వెంట నిలిచాయి.
2016లో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పథకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్ షిప్ రజిత పథకం సాధించాడు.
వరల్డ్ అండర్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు.. జావెలిన్‌ని 86.48 మీటర్లు దూరం విసిరి వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించాడు.
2018లో తన పేరుమీద ఉన్న 87.43 మీటర్ల రికార్డును 88.07 మీటర్లతో తన రికార్డును తనే బ్రేక్ చేసుకున్నాడు.
టోక్యో 2020 లో భారత దేశానికి ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.
2003 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
2025 జరిగిన దోహా డైమండ్ లీగ్ జావెలిన్‌త్రో పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. 90.23 మీటర్ల దూరంతో బల్లెం విసిరి.. తొలి భారత జావెలిన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇక రేపు జరగనున్న దోహా ఇంటర్నేషనల్‌లో నీరజ్ కూడా పాల్గొననున్నాడు. దేశ ప్రాదేశిక సైన్యంలో సుబేదార్ మేజర్‌గా పని చేస్తున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ.. గెజిట్‌ను విడుదల చేసింది.
Neeraj Chopra joins the 90M 𝐂𝐋𝐔𝐁 🔥 👏 🇮🇳 Neeraj Chopra finally broke the 90m barrier for the first time in his career, with a throw of 90.23 at the Doha Diamond League. #NeerajChopra pic.twitter.com/zopYfa45Xk
— Doordarshan Sports (@ddsportschannel) May 16, 2025