Manchu Manoj.. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా కొట్టుకోవడం, తిట్టుకోవడం, పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో అందరూ ఈ కుటుంబం వైపే చూస్తున్నారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను నడి రోడ్డు మీదకు తీసుకు రావడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా జల్పల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం మంచు ఫ్యామిలీ పరువు పోయేలా చేసిందని ఫాన్సీ సైతం కామెంట్స్ చేశారు. ఇకపోతే మంచు వారు ఇలా కొట్టుకుంటూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంటే.. మీమర్స్ మాత్రం ఎవరికి తోచినట్టు వారు తమకు కావాల్సిన స్టఫ్ ను తీసుకున్నారు. అందులో భాగంగానే మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన కామెంట్లను మీమర్స్ తమదైన స్టైల్ లో వాడుకోవడం చూసి.. ప్రతి ఒక్కరూ ఆ పదాలనే ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇవి కాస్త వైరల్ గా మారడంతో దీనిపై మంచు మనోజ్ కూడా తన ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ పెట్టడంతో ఇది కాస్త హైలెట్ అవుతోంది.
రెచ్చిపోయిన మీమర్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. తమ కుటుంబం నుండి తమకు ప్రాణహాని ఉందని మనోజ్ తన భార్య మౌనిక రెడ్డి(Mounika Reddy)తో కలిసి డీజీపీ, డీజీలను కలిసి ఇంటికి వస్తున్న సమయంలో జల్పల్లి లో ఉన్న మోహన్ బాబు(Mohan Babu) ఫామ్ హౌస్ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వీరిని లోపలికి రానివ్వలేదు. ఎంత బ్రతిమలాడినా సరే సెక్యూరిటీ అనుమతించలేదు. దీనికి తోడు మనోజ్ చెప్పే మాటలు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి అర్థం కాలేదని సమాచారం. వారు హిందీ కావడంతో మనోజ్ కూడా తనకు వచ్చీరాని హిందీలో మాట్లాడడమే కాకుండా కొన్ని పదాలను కూడా ఉపయోగించాడు. ఇప్పుడు ఆ పదాలను మీమర్స్ ఉపయోగిస్తూ సరికొత్త తిట్టు అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. మీకు ఎవరిమీదైనా పట్టరాని కోపం వస్తే మంచు మనోజ్ ఉపయోగించిన ఈ కొత్త తిట్లను మీరు ఉపయోగించవచ్చు అంటూ మీమ్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.
మీమ్స్ పై స్పందించిన మంచు మనోజ్..
అయితే ఇలా మీమ్స్ తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ మీమ్స్ కాస్త మనోజ్ వరకు చేరడంతో మనోజ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఈ మీమ్స్ పై స్పందించారు. ముఖ్యంగా మనోజ్ మాటలను మీమర్స్ తెగ వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఆ మాటలను ఆయన షేర్ చేస్తూ ఆశ్చర్యంతో కూడిన ఏమోజి ఒకటి, అలాగే నవ్వుతూ ఉన్న మరొక ఏమోజీ షేర్ చేశాడు. మొత్తానికైతే మీమర్స్ క్రియేట్ చేసిన ఈ మాటలు అటు మనోజ్ కి కూడా బాగా నచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా మీమర్స్ తమదైన స్టైల్ లో మీమ్స్ క్రియేట్ చేస్తూ మరొకసారి వార్తల్లో నిలిచారని చెప్పవచ్చు.