Internet : ఇంటర్నెట్ కు సంబంధించి తాజాగా ఓ విషయం ప్రతీ ఒక్కరినీ కలవరపెడుతుంది. అది ఏంటంటే.. జనవరి 16న ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోతున్నాయి. నిజమా.. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఈ విషయం ప్రముఖ యానిమేటెడ్ కామెడీ సిరీస్ సిమ్సన్ లో కనిపించటంతో… ప్రచారం జోరందుకొని చర్చకు దారితీసింది.
ఇంటర్నెట్ లేకుండా ఈ స్మార్ట్ యుగంలో ఒక్క క్షణం కూడా గడవదు. ప్రతీ విషయం ఇంటర్నెట్ తోనే ముడిపడి ఉంది. అయితే ఈ సేవలు ఒక్కసారిగా ఆగిపోతే.. ఊహించటానికే కష్టంగా ఉంది కదా… మరి అలాంటి రోజునే యూజర్స్ త్వరలో ఎదుర్కోబోతున్నారని… యానిమేటెడ్ కామెడీ సిరీస్ సిమ్సన్ తెలిపింది.
ది సింప్సన్స్.. భవిష్యత్ ఈవెంట్‌లను అంచనా వేయగలదనే గట్టి నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రియోట్ చేసింది ఇప్పటికే ఇది ఆన్‌లైన్‌లో లెక్కలేనన్ని చర్చలకు దారితీసింది. స్మార్ట్‌వాచ్‌ల వంటి సాంకేతిక పురోగతుల నుండి ప్రధాన గ్లోబల్ ఈవెంట్‌ల వరకు నిజ జీవితంలో జరిగే సంఘటనలను ఈ కార్యక్రమం ముందే అంచనా వేసి చెప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ “అంచనాలను” హైలైట్ చేసే క్లిప్‌లు, మీమ్‌లను తరచూ షేర్ చేస్తూ ఉంటారు కూడా. అంతే కాకుండా దీన్ని క్రియేటర్‌లను టైమ్ ట్రావెలర్‌లుగా కూడా చెప్తుంటారు. అయితే ఈ షో తాజాగా జనవరి 16, 2025న ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ బ్లాక్ అవుట్‌ను ఎదుర్కొంటుందని తెలిపింది.
ది సింప్సన్స్ షో నుండి వచ్చిందని.. జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అంతరాయాన్ని అంచనా వేస్తూ ఎడిట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షో నుండి ఒక ఎపిసోడ్‌ను చూపిస్తామని తెలుపుతూ.. ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. జనవరి 16న జరగనున్న షట్ డౌన్.. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంతో సమానంగా ఉంటుందని ఈ వీడియో చెబుతుంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా జనవరి 16న ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోతున్నాయి అనే విషయం హల్చల్ చేయడంతో ఈ విషయం చర్చ నెలకొంది. ఈ విషయంపైనే ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇంటర్నెట్ బంద్ అవుతుంది అంటూ మీమ్స్, జోక్స్ హల్చల్ చేస్తున్నాయి. సిమ్సన్ ప్రిడక్షన్ నిజమవుతుందనే నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
“జనవరి 16 కో రీఛార్జ్ కటం హోనీ వాలా హై” అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ చమత్కరించారు. ఇక మరొకరు “అచ్చి బాత్ హై” అని కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది “ఇది అసాధ్యమైనది.” అని.. “కర్వా దే, నేను ఇంటి నుండి పని చేస్తున్నాను… కాబట్టి, మెరి టు ఆఫ్.” అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు పలు రకాల కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ది సింప్సన్స్ షో చెప్పిన ఈ విషయం నిజంగానే జరుగుతుందా.. లేదా అనే విషయం తెలియాలంటే జనవరి 16 వరకూ ఆగాల్సిందే.
ALSO READ : సామ్ సాంగ్ స్లిమ్ మెుబైల్ పై కిర్రాక్ అప్డేట్