Entrance Exams: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రకటనలో పూర్తి వివరాలను విడుదల చేశారు.
పరీక్ష నిర్వహించే యూనివర్సిటీ పేరు కూడా చెప్పారు. లాసెట్, టీజీ ఈసెట్ పరీక్షలను ప్రతిష్టాత్మక ఉస్మానియా వర్సిటీ నిర్వహించనుది. పీజీఈసెట్, ఈఏపీసెట్ ఎగ్జామ్‌లను జేఎన్టీయూ నిర్వహించనుంది. అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలోని జరగనున్నాయి.
ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్ సెట్ (ఈఏపీసెట్).. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష.. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే.. మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్, జూన్ 6న లా సెట్, పీజీ ఎల్ సెట్, జూన్ 8, 9న ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈ సెట్, జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: CM Revanth Reddy: 140 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ స్వార్థం లేకుండా పని చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
పరీక్షల షెడ్యూల్ ఇదే:
ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్ సెట్ (eapcet)
(ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ)
(మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్)
మే 12న ఈ సెట్
జూన్ 1న ఎడ్ సెట్
జూన్ 6న లా సెట్
పీజీ ఎల్.సెట్
జూన్ 8, 9న ఐసెట్
జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్
జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు