Mohan Babu As Mahadeva Sastry : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘కన్నప్ప’ (Kannappa) టీం నుంచి ఆయన నటిస్తున్న పాత్ర మహదేవ శాస్త్రి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి, మంచు విష్ణు (Manchu Vishnu) స్పెషల్ గా తన తండ్రిని విష్ చేశారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) గురించి టాలీవుడ్ మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన, అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా మారి ఎన్నో సినిమాలను తెరపైకి తీసుకొచ్చారు. ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నో పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన మోహన్ బాబు… నటుడిగా ఐదు దశాబ్దల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని తాజాగా పూర్తి చేసుకున్నారు.
1975 నుంచి 1990 వరకు విలన్ పాత్రలో నటించి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నారు మోహన్ బాబు (Mohan Babu). అనంతరం అల్లుడు గారు, పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్ వంటి ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా మోహన్ బాబు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో… ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి విషెస్ వెలువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా “కన్నప్ప” (Kannappa) టీం సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది
ఈ సినిమాలో మోహన్ బాబు (Mohan Babu) మహాదేవ శాస్త్రి (Mahadeva Sastry) అనే పాత్రను పోషిస్తున్నారు. “మహాదేవ శాస్త్రి చిరకాలం గుర్తుండిపోయే, భయపెట్టే పాత్ర. శుభాకాంక్షలు నాన్న… ఈరోజు నటుడిగా మీ 50 ఏళ్ల వార్షికోత్సవం.. నువ్వే నా ఐడల్, హీరో” అంటూ మంచు విష్ణు “కన్నప్ప” సినిమాలోని మహదేవ శాస్త్రి పోస్టర్ తో మోహన్ బాబును విష్ చేశారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa). ఇందులో మంచు విష్ణు హీరోగా నటిస్తుండగా మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇక మంచు ఫ్యామిలీ ఈ ప్రాజెక్ట్ తమ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాలో నుంచి లీకైన ప్రభాస్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. సినిమా మొదలైనప్పటి నుంచి నడుస్తున్న ఈ విమర్శలు తాజాగా మహాదేవ శాస్త్రి పోస్టర్ పై కూడా కొనసాగుతున్నాయి. ’48 గంటల్లోగా చెడు కామెంట్స్ అన్ని డిలీట్ చేయండి’ అంటూ మంచు విష్ణుపై సెటైర్లు విసురుతున్నారు. మరి కొంతమంది ‘కంగువా అయిపోయింది… ఇక ‘కన్నప్ప’ ను చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.