Mangalagiri man: ఎంత మాత్రం ఆవేశం వస్తే ఇంతలా రచ్చ చేయాలా.. ఇదేమి గోలరా నాయనా.. ఉదయాన్నే మాకు ఈ గోల ఏంది? అసలు వదలవద్దు సార్. అతడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే అంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఒక్కసారిగా నగ్నంగా బయటకు వచ్చి హల్చల్ చేశాడు. అది కూడా మహిళలు బయట ఉన్న సమయంలో. దీనితో అతడిని పట్టుకొని, దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు మహిళలు. అసలేం జరిగిందంటే..
మంగళగిరి లోని రత్నాల చెరువు వెంబడి పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. అవి చిన్న గృహాలు కావడంతో అక్కడి మగవారు బయటనే స్నానం చేయాల్సిన పరిస్థితి. మగవారు తమ గృహాలపై స్నానం చేసే ప్రక్రియ రోజుల తరబడి సాగేది. ఇలా మగవారు రహదారిపై స్నానం చేయడాన్ని అదే కాలనీకి చెందిన గోల్డ్ వ్యాపారి రామాంజనేయులు వ్యతిరేకించారు. మగవారు టువాలు కట్టుకొని స్నానం చేస్తున్నా, రామాంజనేయులుకు మాత్రం అది సమ్మతంగా లేదు.
శుక్రవారం తెల్లవారింది. హఠాత్తుగా రామాంజనేయులు నగ్నంగా కాలనీలోకి వచ్చేశాడు. కారణం ఏమయ్యా అంటూ ఆరా తీస్తే.. ఏముంది మీ మగవారు మాత్రం బయట స్నానం చేయడం లేదా అంటూ.. ప్రశ్నించారట. రామాంజనేయులు నగ్నంగా కాలనీ మొత్తం తిరగగా, మహిళలు, అక్కడి పురుషులు ఏకమై దేహశుద్దికి పూనుకున్నారు.
Also Read: YS Sharmila on Hero Prabhas: ప్రభాస్ ఎవరో కూడా తెలియదు.. అన్నా నీకిది తగునా.. షర్మిళ ఫైర్
అలాగే స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పురుషులు బయట స్నానాలు చేస్తున్నారని, అందుకు మరీ నగ్నంగా తిరిగి నిరసన తెలిపితే.. కటకటాల్లోకి వెళ్తానన్న మాట మరిచి రామాంజనేయులు తన కోపం ఇలా బయటకు వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు స్థానికులు.
పోలీసులు మాత్రం స్థానికుల నుండి ఫిర్యాదు అందుకొని రామాంజనేయులుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద నమోదు చేశారు. అతడిని అదుపులోకి అసలు సంగతి ఏమిటని విచారిస్తున్నారు. మరి రామాంజనేయులు వాదన ఏమిటో కాని బయటకు వెల్లడి కావాల్సి ఉంది.
మహిళల ముందు గోలి రామాంజనేయులు నగ్న ప్రదర్శన
మంగళగిరి రత్నాల చెరువు వెంబడి ఉన్న కుటుంబాల్లోని మగవారు రోడ్లపై స్నానాలు చేయొద్దంటూ వీరంగం
నగ్న ప్రదర్శన చేసి మహిళలను అసభ్యకరంగా తిట్టిన గోల్డ్ వ్యాపారి రామాంజనేయులు
మహిళల ఫిర్యాదుతో రామాంజనేయులుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు… pic.twitter.com/A2HJM3MzPx
— BIG TV Breaking News (@bigtvtelugu) November 22, 2024