E-Paper
Advertisement

Manchu Family Dispute: మంచు ఫ్యామిలీలో నిప్పులు పోసిన ఇల్లు ఇదే.. దీని ప్రత్యేకతలు తెలిస్తే కళ్లు తిరుగుతాయ్!

Manchu Family Dispute: మంచు ఫ్యామిలీలో నిప్పులు పోసిన ఇల్లు ఇదే.. దీని ప్రత్యేకతలు తెలిస్తే కళ్లు తిరుగుతాయ్!
Advertisement

Manchu Mohanbabu House Video: గత కొద్ది రోజులుగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు మనోజ్ మధ్య వివాదం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆస్తుల విషయంలో ఇరువురి మధ్య కొట్లాటకు కారణం అయినట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి కారణం జల్ పల్లిలో మోహన్ బాబు నిర్మించుకున్న ఇల్లే అని ప్రచారం జరుగుతున్నది. ఈ ఇల్లు తనకు ఇవ్వాలని మనోజ్ గొడవ చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును ఇచ్చేది లేదని మోహన్ బాబు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ ఇంటికి సంబంధించి మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గతంలో హోం టూర్ వీడియో చేసింది. ఈ భవనం చూస్తే మోహన్ బాబుకు ఎంత అద్భుతమైన టేస్ట్ ఉందో అర్థం అవుతోంది.

జల్ పల్లిలో ఇంటి నిర్మాణం

Advertisement

మోహన్ బాబు గతంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని నివాసంలో ఉండేవారు. ఈ ఇంటిని తన కూతురు మంచు లక్ష్మికి ఇచ్చారు. ఆ తర్వాత రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతంగా ఉండాలని మోహన్ బాబు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర లోని జల్ పల్లిలో భూమిని కొనుగోలు చేశారు. అక్కడ తన అభిరుచికి తగినట్లుగా అద్భుతమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన ఇంటి సమీపంలో పెద్దగా నివాసాలు లేవు. బయట నుంచి చూస్తే ఈ ఇల్లు ఓ ప్యాలెస్ లా కనిపిస్తుంది.

హోమ్ టూర్ వీడియో చేసిన మంచు లక్ష్మి

Advertisement

ఇక జల్ పల్లి నివాసానికి సంబంధించి మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి హోమ్ టూర్ నిర్వహించింది. ఈ ఇంటిలోని ప్రత్యేకతలను పూసగుచ్చినట్లుగా చెప్తూ ఓ వీడియో రూపొందించింది. మంచు లక్ష్మి, ఆమె కూతురు కలిసి ఈ ఇంటి హోమ్ టూర్ నిర్వహించారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా షేర్ చేశారు. ఇప్పటికి 12 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

ఇంద్ర భవనాన్ని తలదన్నేలా ఇంటి నిర్మాణం 

జల్ పల్లిలో మోహన్ బాబు నిర్మించిన ఇంటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సంప్రదాయాలు, ఆధునికతను మేళవిస్తూ ఈ ఇంటిని నిర్మించారు. ఇందులో రాజ భవనాన్ని తలదన్నలేలా సౌకర్యాలు ఉన్నాయి. అద్భుతమైన గార్డెన్ లో అరుదైన మొక్కలను నాటించారు మోహన్ బాబు. గార్డెన్ తో పాటు ఇంటి మీద కూడా అద్భుతమైన స్విమ్మింగ్ ఫూల్ నిర్మించారు. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ ఇంట్లో ఒక్కో ఫ్లోర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇంట్లోకి వెళ్లగానే అద్భుతమైన హాల్, కిచెన్, జిమ్ కనిపిస్తుంది. గ్రౌండ్ ఫోర్ లో గెస్టులకు ప్రత్యేకమైన గదులు నిర్మించారు. మొదటి అంతస్తులో మోహన్ బాబు ఆఫీస్ ఉంటుంది. ఇందులో ఆయన ఫోటోలు, అవార్డులను పొందుపరిచారు. ఆ తర్వాత అంతస్తులో అందరూ కలిసి సినిమాలు చూసేలా మినీ థియేటర్ ఉంది. అటు ఇంట్లో పని వాళ్లకు ప్రత్యేకంగా ఇళ్లు కట్టించారు. మొత్తంగా మోహన్ బాబు తన ఆసక్తికి అనుగుణంగా అద్భుతమైన వ్యూ ఉండేలా ఈ ఇంటిని కట్టుకున్నారు. మంచు లక్ష్మి హోమ్ టూర్ వీడియోను మీరూ చూడండి..

Read Also:మంచు మనోజ్ పతనానికి కారణం ఎవరు?

ఆస్తుల పంపకం తర్వాత జల్ పల్లిలో ఉంటున్న మోహన్ బాబు   

వాస్తవానికి గత కొద్ది సంవత్సరాల క్రితమే మోహన్ బాబు తన ఆస్తులను తన వారసులకు పంచారు. అందులో భాగంగానే హైదరాబాద్ ఫిల్మ్ నగరల్ లోని నివాసాన్ని మంచు లక్ష్మికి ఇచ్చారు. అప్పటి నుంచి మోహన్ బాబు జల్ పల్లిలోనే ఉంటున్నారు. ఈ ఇంట్లో కొన్ని సినిమా షూటింగులు కూడా జరిగినట్లు తెలుస్తున్నది. మొత్తంగా మోహన్ బాబు నివాసంలోని ప్రతి అంగుళం అబ్బురపరిచేలా ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు కావాలని మనోజ్ కొట్లాడుతున్నట్లు సమాచారం. తాజాగా వివాదానికి ఈ ఇల్లే కారణం అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది.

Read Also: మనోజ్ భార్య ఏం చేస్తోందో తెలుసా..? ఆమె ఆస్తి విలువ ఎంతంటే?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×