Keerthy Suresh Marriage.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ (Keerthi Suresh) గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలోని ప్రముఖ రిసార్ట్ లో వీరి పెళ్లి పూర్తయింది. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్ (Antony tattil)తో కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గోదాదేవి గెటప్ లో కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకుంది. శ్రీ రంగనాథుడి గెటప్ లో ఆంటోని కనిపించారు. దేవదేవుల అవతారంలో కీర్తి సురేష్ ఆమె భర్త ఆంటోనిల పెళ్లి అందరికీ కన్నుల పండుగలా అనిపించింది. ముఖ్యంగా దేవతలే దివి నుంచి భువికి దిగివచ్చి వివాహం చేసుకుంటున్నారా అనేంతలా అందరిని ఆకట్టుకుంది ఈ జంట. మొత్తానికైతే మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది
కీర్తి సురేష్ భర్త బ్యాక్ గ్రౌండ్..
ఆంటోనీ తటిల్ కేరళలోని కొచ్చి ప్రాంతానికి చెందినవారు. యునైటెడ్ స్టేట్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈయన గ్రాడ్యుయేషన్ తర్వాత ఖతార్లో చాలా కాలం పని చేశారు. ఆ తర్వాత తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కొచ్చికి తిరిగి వచ్చారు. ఈయనకు దుబాయిలో ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి. అంతేకాదు రిసార్ట్ లతో సహా ఎన్నో రకాల బిజినెస్లను ఆంటోనీ చేస్తూ ఉంటారు. కేరళ , చెన్నై అంతటా కూడా హాస్పిటల్ వెంచర్లలో కూడా ఆంటోనీకి వ్యాపారాలు ఉండడం గమనార్హం.
కీర్తి సురేష్ తో ప్రేమ పరిచయం..
కీర్తి సురేష్ – ఆంటోనీ మధ్య స్నేహం ఈనాటిది కాదు. స్కూల్ రోజుల నుంచి వీరి మధ్య పరిచయం ఉండేది. ఇక 12వ తరగతి నుంచి ఒకరికొకరు పరిచయం పెంచుకున్నారు. ఇక కేరళలో ఇంటర్మీడియట్ కూడా పాఠశాల వ్యవస్థలోకే వస్తుంది. అలా దాదాపు 15 సంవత్సరాలుగా వీళ్ళ స్నేహం కొనసాగుతోంది. ఇక బెస్ట్ ఫ్రెండ్ భర్త అయితే అంతకంటే బెటర్ పార్టనర్ ఎవరుంటారు అనే ఆలోచనతో ఆంటోనీ ప్రేమకు కీర్తి సురేష్ అంగీకారం చెప్పినట్లు సమాచారం. ఇక మొత్తానికైతే వీరిద్దరూ కూడా ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు.
కీర్తి సురేష్ కెరియర్..
ఈమె తండ్రి ప్రముఖ మలయాళ నిర్మాత జి.సురేష్ కుమార్ (G.Suresh Kumar)తల్లి ప్రముఖ మలయాళ హీరోయిన్ మేనక(Menaka). సినీ బ్యాగ్రౌండ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. తెలుగులో రామ్ సరసన ‘నేను శైలజ’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో ఏకంగా జాతీయస్థాయి అవార్డును అందుకుంది. ఇక ప్రస్తుతం హిందీలో ‘బేబీ జాన్’ సినిమాలో చేస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఇలా ఒకవైపు వృత్తిగత జీవితం, మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది కీర్తి సురేష్. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ కి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు, సినీ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.