Nayanthara – Dhanush : ‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairytale) వివాదం కారణంగా హీరో ధనుష్ (Dhanush) ఇటీవలే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన నయనతార – విగ్నేష్ శివన్ దంపతులపై ఈ దావాను వేయగా, తాజాగా దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే సమాధానం ఇవ్వాలంటూ హైకోర్టు నయనతార (Nayanthara)తో పాటు నెట్ ఫ్లిక్స్ (Netflix) కు నోటీసులు జారీ చేసింది.
నయనతార జీవితం ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఫిలిం ‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairytale). అయితే ఈ డాక్యుమెంటరీలో తన పర్మిషన్ తీసుకోకుండానే ‘నేనూ రౌడీనే’ అనే సినిమా ఫుటేజ్ ని ఉపయోగించారని ఆరోపించారు ధనుష్. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధనుష్ మూడు సెకండ్ల క్లిప్ ను డాక్యుమెంటరీలో ఉపయోగించినందుకు నయనతారకు లీగల్ నోటీసులు పంపారు. అంతేకాకుండా 10 కోట్లు నష్టపరిహారంగా డిమాండ్ చేశారు. దీంతో ఏకంగా నయనతార ధనుష్ క్యారెక్టర్ ను తప్పు పడుతూనే, తనపై అతను ద్వేషం వ్యక్తం చేస్తున్నాడు అంటూ సుదీర్ఘ లేఖను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే అప్పటికే లీగల్ నోటీసులు పంపించినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలను ఉపయోగించడంపై ధనుష్ ఫైర్ అయ్యారు. నయన్ (Nayanthara) దంపతులపై కోర్టుకు ఎక్కారు. తాజాగా ఈ కేసు విచారణ మద్రాసు హైకోర్టులో జరగగా, న్యాయస్థానం జనవరి 8వ తేదీలోపు సమాధానం ఇవ్వాలంటూ నయన్ దంపతులతో పాటు నెట్ ఫ్లిక్స్ టీంను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు వారికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార (Nayanthara) మాట్లాడుతూ “తప్పు చేస్తే భయపడాలి కానీ… న్యాయమని నమ్మిన దాన్ని బయట పెట్టడానికి ఎందుకు భయపడాలి? పబ్లిసిటీ కోసం అవతలి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే మనిషిని కాదు. నా డాక్యుమెంటరీ ఫిలిం పబ్లిసిటీ కోసమే ఇలా చేశానని అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నిజానికి వీడియో క్లిప్స్ కు సంబంధించిన ఎన్వోసీ కోసం ధనుష్ ను సంప్రదించడానికి చాలా ట్రై చేసాం. స్వయంగా విగ్నేష్ ఫోన్ కూడా చేశాడు. కానీ ఎంత ప్రయత్నించినా మాకు ఎన్ఓసి రాలేదు. దీంతో సినిమాలో ఉపయోగించిన నాలుగు లైన్ల డైలాగ్ ను మా డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ఉపయోగించాలని అనుకున్నాం. ఆ మాటలు మా జీవితానికి చాలా ముఖ్యమని భావించాము. కానీ ధనుష్ (Dhanush) ఈ విషయంలో ఇలా ప్రవర్తించడానికి కారణమేంటి? ఎందుకు అతనికి నాపై కోపం వచ్చింది ? అనే విషయాలను క్లియర్ చేసుకోవడానికి అతనితో ఒక్కసారైనా మాట్లాడాలనుకున్నాను. కానీ అది కుదరలేదు. నిజానికి మేము ఇద్దరం ఫ్రెండ్స్. కానీ ఈ పదేళ్ళలో ఏం జరిగిందో నాకు తెలియదు” అంటూ వివాదం గురించి చెప్పుకొచ్చింది. మరిప్పుడు కోర్టుకు నయనతార ఇచ్చే సమాధానం ఏంటి ? అనేది ఆసక్తికరంగా మారింది.