Bhuma Mounika Assets.. తెలుగు చిన్న చిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ. అయితే ఈ కుటుంబంలో గొడవలు ఒక్కసారిగా రోడ్డుకెక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. తనకు అన్యాయం చేస్తున్నారని మంచు మనోజ్ (Manchu Manoj)తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తుంటే, మరొకవైపు భూమా మౌనిక(Bhuma Mounika) వచ్చిన తర్వాతే మనోజ్ మందుకు బానిస అయ్యాడని, తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని మోహన్ బాబు(Mohan Babu) కామెంట్లు చేశారు. ఇకపోతే మౌనిక తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తాను ఒక ప్రయోజకుడిని అయ్యాను అని మనోజ్ తెలుపుతున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే ఇప్పుడు ఇంట్లో ఆస్తి తగాదాలకు కారణం మౌనిక అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక్క మౌనిక ఆస్తి విలువ రూ.2వేల కోట్లు..
అయితే మౌనిక అభిమానులు మాత్రం ఆమె ఒకరి ఆస్తి కోసం గొడవ పడాల్సిన అవసరం ఏముంది? అంటూ మౌనికకు మద్దతు పలుకుతున్నారు. మౌనిక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆమె ఆస్తి విలువ సుమారుగా 2000కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. మొదటి భర్త నుండి విడిపోయినప్పుడు భరణంగా 250 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలిసింది. అంతేకాదు మౌనిక పేరు మీద కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అంతేకాదు ఆళ్లగడ్డ, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలలో మౌనిక పేరు మీద ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి దీన్ని బట్టి చూస్తే భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో మాత్రం మౌనిక వల్లే ఆస్తి గొడవలు మొదలయ్యాయి అనే వార్తలు వినిపిస్తుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియదు కానీ భూమా మౌనిక వల్లే గొడవలు వస్తున్నాయని మోహన్ బాబు చెప్పడాన్ని మాత్రం మనోజ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మనోజ్ కి అండగా మౌనిక..
స్వతహాగా భూమా మౌనిక క్యారెక్టర్ విషయానికి చాలా సౌమ్యురాలు. ఎవరి జోలికి అంత ఈజీగా వెళ్లదు. ఒకవేళ తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అగ్రెసివ్ అయిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు గొడవల కి వెళ్ళదు మౌనిక. ఎప్పుడు సామాజిక సేవ చేస్తూ తన అక్క భూమా అఖిలప్రియకు రాజకీయాలలో అండగా నిలుస్తూ.. కెరియర్ సాగిస్తున్న భూమా మౌనిక జీవితంలోకి ఒక్కసారిగా మంచు మనోజ్ వచ్చారు. దాంతో ఆమె జీవితం మొత్తం మారిపోయింది. భర్తను ప్రయోజకుడ్ని చేయడానికి భూమా మౌనిక పడ్డ కష్టాలు వర్ణనాతీతం. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మనోజ్ కూడా తన భార్య పడిన కష్టం గురించి వెల్లడించారు.
బొమ్మలు బిజినెస్ చేస్తున్న మౌనిక..
మనోజ్ మాట్లాడుతూ.. మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. పురాణ కథలను ఆధారంగా చేసుకొని గొప్ప పాత్రల చుట్టూ మేము కథలు రాసాము. అయితే అదే సమయంలో మొదటి లాక్ డౌన్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలో తెలియదు. దాంతో మౌనిక.. మనోజ్ నీకు బొమ్మలు గీయడం వచ్చు కదా దానినే మనం వ్యాపారంగా మొదలు పెడదాం అంటూ చెప్పింది. అలా నాలుగున్నర సంవత్సరాల పాటు మేము కష్టపడ్డాం. దేశంలో నలుమూలల తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడి సరుకు తీసుకొచ్చి బొమ్మలు తయారుచేసాం. ఇక ప్రస్తుతం ‘నమస్తే వరల్డ్ ‘ పేరిట మేము హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్లో బొమ్మలు షాప్ ని కూడా ప్రారంభించాం. ప్రస్తుతం దీని బాధ్యతలు మొత్తం మౌనిక చూసుకుంటుంది అంటూ మౌనిక గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తండ్రి నుంచి వేల కోట్ల ఆస్తులను పొందిన మౌనిక ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడి మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది.ఇక ఒకవైపు బిజినెస్ చూసుకుంటూనే మరొకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ జంట అనూహ్యంగా చిక్కుల్లో పడడంతో అభిమానులు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు.