BigTV English

Bhakta Kannappa : మంచు విష్ణు పుట్టినరోజు స్పెషల్.. ఆకట్టుకుంటున్న ‘భక్త కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌

Bhakta Kannappa : మంచు విష్ణు పుట్టినరోజు స్పెషల్.. ఆకట్టుకుంటున్న ‘భక్త కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌
Bhakta Kannappa

Bhakta Kannappa : మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. సాలిడ్ మూవీస్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొద్ది కాలంగా అతను కెరీర్ పరంగా కాస్త ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో తన బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప మూవీ తెరకెక్కించడానికి ఫిక్స్ అయ్యాడు విష్ణు. భారీ బడ్జెట్ తో.. అగ్ర తారాగణంతో ఈ చిత్రం షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతోంది.


రెబెల్ స్టార్ కృష్ణంరాజు ..కన్నప్ప వేషంలో నటించిన భక్తకన్నప్ప చిత్రం 1976లో విడుదల అయింది. పరమ శివుడి పై ఒక నాస్తికుడికి భక్తి ఎలా కలిగింది?అసలు భక్తి అంటే అర్థం ఏమిటి?అంద విశ్వాసాలు.. మూఢ నమ్మకాలు మనిషిని దేవుడికి ఎలా దూరం చేస్తున్నాయి? అనే అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది ఈ చిత్రం. శ్రీకాళహస్తి అడవులలో తిరిగే ఒక అడవి బిడ్డ నిజ జీవిత గాథ భక్తకన్నప్ప.

శ్రీకాళహస్తి లో కొలువు ఉన్న శివయ్యకు అపరిమితమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. గ్రహణం రోజు కూడా తెరిచి ఉంచే ఈ గుడిలో ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి. అమాయకపు భక్తీ భగవంతుడిని అయినా కట్టిపడేస్తుంది అనే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ చిత్రంలో కృష్ణంరాజు భక్తకన్నప్పగా ఆ పాత్రకి ప్రాణం పోశారు. మరీ ముఖ్యంగా శివలింగం కళ్ళ నుంచి రక్తం కారుతుంటే ముందు వెనక ఆలోచించకుండా తన కళ్ళు తీసి లింగానికి పెట్టే సీన్ లో కృష్ణంరాజు నటన హైలెట్.


ఇంతవరకు బాగానే ఉంది కానీ కృష్ణంరాజు లాంటి లెజెండరీ యాక్టర్ నటించిన పాత్రలో మంచు విష్ణు ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో వేచి చూడాలి. ఇందులో మంచు విష్ణు భక్తకన్నప్ప గా నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇక వీరితోపాటు పలు సినీ ఇండస్ట్రీల నుంచి అగ్రతారాగణం ఈ మూవీలో నటిస్తున్నారు. ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ మాంచి ఇంట్రెస్టింగ్ విజువల్స్ తో విడుదల చేశారు.

పంచభూతాలను పులకింప చేసే ప్రకృతి మధ్యలో.. పంచభూతేశ్వరుడు..ఆ మహా శివుని శివలింగం అనంతంగా కనిపిస్తుంది. ఆ మహా లింగం ముందు భక్తకన్నప్ప గెటప్ లో విల్లుకి బాణాన్ని సంధించి వెనక్కి తిరిగి నిలబడ్డ మంచు విష్ణు. చూడడానికి పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలిసిన కథ అయినప్పటికీ.. భక్తి చిత్రాలకు టాలీవుడ్ లో మార్కెట్ బాగానే ఉంటుంది. పైగా ఇందులో ప్రభాస్ కూడా నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లోనే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు పెద్ద రిస్క్ తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆశించిన ఫలితాలు అందిస్తుందని ఆశిద్దాం.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×