BigTV English

Vishnu Manchu: నా చెయ్యి.. హీరోయిన్ తొడంత ఉండేది.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్

Vishnu Manchu: నా చెయ్యి.. హీరోయిన్ తొడంత ఉండేది.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్

Vishnu Manchu: ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. విష్ణు ఎన్నోసార్లు ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీనికోసం అహర్నిశలు కష్టపడుతున్నట్లు తెలిపారు. జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం తన వర్కౌట్స్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు ఆ వివరాలు చూద్దాం..


నా చెయ్యి.. హీరోయిన్ తొడంత ఉండేది..

మంచు విష్ణు కన్నప్ప సినిమాలో శివ భక్తుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం, పౌరాణిక అంశాలతో పాటు యాక్షన్స్ సన్నివేశాలను జోడించి, ఈ చిత్రాన్ని రూపొందించారు. శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథగా ఈ చిత్రం రూపొందింది. తాజాగా మంచు విష్ణు కు ఈ సినిమా కోసం బాగా వర్కౌట్ చేశారా అనే ప్రశ్న ఎదురుగా.. విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. మొదట పోస్టరర్ రిలీజ్ చేసినప్పుడు,సాంగ్ లో చుస్తే, నేను 104 కిలోల బరువు ఉన్నాను. నా ఆమ్ సైజు 21 ఇంచెస్. నేనిప్పుడు 80 కిలోలకు వచ్చేసాను. ప్రమోషన్స్ కోసం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం తిరుగుతున్నప్పుడు జిమ్ముకు వెళ్లడం తగ్గించాను. అందుకే బరువు తగ్గాను. కానీ మూవీ చేస్తున్న టైంలో, ఎంతో వర్కౌట్స్ చేసి బాడీ పెంచాల్సి వచ్చింది. సినిమాలో లాగే బయట కూడా ఉండాలంటే, బోన్సర్స్ మాదిరి బయట కూడా ఉండాలంటే వర్కౌట్ అవ్వదని, కొంచెం తగ్గాను. నా చేయి మా హీరోయిన్ తొడంత ఉండేది. బ్రహ్మానందం గారు దానిపై కామెడీ కూడా చేసేవారు. ఇప్పుడు అదే మెయింటినెన్స్ చేయాలంటే కుదరదు. దానికోసం బాగా తినాలి, వర్కౌట్ చేయాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇదంతా కుదరదు కాబట్టే ఇప్పుడు తగ్గాను. అని విష్ణు తెలిపారు.ఈ వీడియో చూసిన వారంతా, మంచు విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు హీరోయిన్ తొడ తో పోల్చటం బాలేదని కామెంట్స్ చేసారు.


ఆలా బాడీ పెంచటం..వారి తరువాతే..ఎవరైనా 

గతంలో ఇంతలా బాడీ పెంచింది బాహుబలి సినిమా కోసం ప్రభాస్, రానా అని విష్ణు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాళ్లు ఎంతో కష్టపడి, అంతకాలం మెయింటెనెన్స్ చేశారు. అలా మెయింటినెన్స్ చేయాలంటే,ఎప్పుడు కుదరదు. అసలు సినిమాలో వాళ్ళిద్దరూ ఎంత హెవీగా ఉండేవారో, అంత ఈజీ కాదు అలా ఉండడం అని ఆయన తెలిపారు.

ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలు నటిస్తున్నారు. వారిలో మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, అర్పిట్ రంకా, కౌశల్ మండ, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముకేష్ రిషి, బ్రహ్మానందం, రఘు బాబు, ప్రీతి ముఖుందన్, నటిస్తున్నారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ అగర్వాల్ పార్వతీ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ఇంతమంది సెలబ్రిటీలు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

KA Paul : ఛీ ఛీ.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా… ప్రభాస్, బాలయ్య దుమ్ము దులిపిన కేఏ పాల్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×