BigTV English

KA Paul : ఛీ ఛీ.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా… ప్రభాస్, బాలయ్య దుమ్ము దులిపిన కేఏ పాల్

KA Paul : ఛీ ఛీ.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా… ప్రభాస్, బాలయ్య దుమ్ము దులిపిన కేఏ పాల్

KA Paul: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సిని సెలెబ్రిటీలను, సోషల్ మీడియా ఇన్ఫ్లోన్సులపై, చట్టపరమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వివాదం తెలంగాణలో 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లెన్సర్లపై కేసులు నమోదు కావడం వారిలో కొంతమందిని విచారించడం మనం చూశాం. తాజాగా ఈ విషయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు.టాలీవుడ్ బిగ్ స్టార్స్ పై ఆయన ఆరోపణలు చేసారు. వివరాలలోకి వెళితే ..


ఛీ ఛీ.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా..

కేఏ పాల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలను, సైబర్ టెర్రరిస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా యువత ఆర్థికంగా మానసికంగా నాశనం అవుతుందని కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు దారితీస్తుందని ఆయన ఆరోపించారు. బెట్టింగ్ యాప్ ద్వారా ఇప్పటికే వేల మంది చనిపోయారు. 25 సంవత్సరాల ఉన్న యువత ఎక్కువ బెట్టింగ్ యాప్స్ వాడుతున్నారు. అనేకమంది సూసైడ్ చేసుకుంటున్నారు. చట్టాలు ఇలాంటి వాటిని ఆపలేవు. ఈ బెట్టింగ్ యాప్ లని,ప్రమోట్ చేస్తున్న వారిలో సచిన్ టెండుల్కర్, సల్మాన్ ఖాన్, షారుఖాన్, అమీర్ ఖాన్, బాలకృష్ణ, ప్రభాస్, ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ కోట్ల రూపాయలు తీసుకొని ప్రమోట్ చేయడం ఏంటి, ఇలాంటివన్నీ తప్పు అని తెలిసి కూడా వీళ్లు అదే తప్పు చేస్తున్నారు. లక్షల కోట్ల ప్రాణాలు కాపాడాలంటే ఒక చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, రాష్ట్రాలన్నీ డిబేట్ పెట్టి, ఇలాంటి యాప్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


కోర్ట్ లో పిటిషన్ .. రాష్ట్రాలకు నోటీసు ..

తెలంగాణ గవర్నమెంట్ ఎంతోమంది సెలబ్రిటీలపై, చార్జ్ షీట్ ఓపెన్ చేశారు. కానీ ఎవరికైనా కేసు పెట్టలేదు ఎవరిని ప్రశ్నించలేదు. అందుకే అయన  బెట్టింగ్ యాప్స్ పై పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసారు. ఈ యాప్ యువత ప్రాణాలను బలిగొంటున్నయని వాటి నిషేధించాలని కేఏ పాల్ కోర్టును కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ..సుప్రీంకోర్టు పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.అవసరమైతే రాష్ట్రాలకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

ప్రధాన ఆరోపణలు ..వారిపైనే ..

తెలంగాణలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీ పై మియాపూర్ లో ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ తో పాటు 19 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లపై, కేసులు నమోదయ్యాయి. దీనిపై మియాపూర్ కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఫిర్యాదు చేస్తూ సెలబ్రిటీలు, ఇన్ఫ్లెన్సర్లు, సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని దీని వల్ల యువత ఆర్థికంగా నష్టపోతుందని పేర్కొన్నారు. ఈ యాప్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని వారిని వ్యసనం లోకి లాగుతున్నాయని ఆయన ఆరోపించారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×