OTT Movie : షార్ట్ ఫిలిమ్స్ ను ఇప్పుడు సెల్ ఫోన్ లోనే చిత్రీకరిస్తూ తమ టాలెంట్ ను చూపించుకుంటున్నారు కొంతమంది యువత. మంచి కంటెంట్ ఉన్న స్టోరీలకు అవార్డులు కూడా దక్కుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిలిం ఒక హారర్ జానర్ లో తెరకెక్కింది. చిన్న పిల్లల్ని టార్గెట్ చేసే ఒక సైకో చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. స్టోరీ చిన్నదే అయినా, చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ షార్ట్ ఫిలిం పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా స్టోరీ ఒక సీక్రెట్ సపోర్ట్ గ్రూప్‌తో ప్రారంభమవుతుంది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఒకచోట చేరి, తమ బాల్యంలో తాము కోల్పోయిన ఒక ముఖ్యమైన విషయాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తారు. ఈ గ్రూప్‌లోని సభ్యులు తమ చిన్నతనంలో జరిగిన ఒక చేదు అనుభవం గురించి చర్చిస్తారు. దీని వల్ల వీరి జీవితాలు పూర్తిగా మారిపోయి ఉంటాయి. ఇందులో ‘గొట్చర్’ అనే చిన్నపిల్లలు ఆడే గేమ్ ఒకటి ఉంటుంది. జెన్నీ అనే అమ్మాయి తన బాల్యంలో ఈ ఆట సమయంలో, ఒక వింత వ్యక్తితో ఎదురైన భయంకర సంఘటనను గుర్తు చేసుకుంటుంది. ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక లోతైన గాయాన్ని మిగిల్చింది. ఆమె మక్కును ఒక వింత మనిషి కట్ చేసి తెసుకెళ్తాడు. సపోర్ట్ గ్రూప్‌లోని సభ్యులందరికీ ఈ అనుభవం చిన్నప్పుడు ఎదురౌతుంది.
ఒకరి బాధలను మరొకరు పంచుకుంటూ, తమ భయాలను ఎదుర్కోవడానికి, న్యాయం కోసం పోరాడటానికి వీళ్ళంతా ఒక ప్లాన్ రూపొందిస్తారు. తమ చిన్నతనంలో ముక్కులను దారుణంగా కోసి తీసుకెళ్లిన ఆ వ్యక్తిపై రెవేంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి పిల్లల ముక్కుని కోసి తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఎవరు ? ఎందుకు అలా చేస్తున్నాడు ? బాధితులు ఎలా అతనిపై రివేంజ్ తీర్చుకుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ ని మిస్ కాకుండా చూడండి.
Read Also : మర్డర్ కేసులో మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్… ఓటిటిలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్
డైలీ మోషన్ (Daily Mostion) లో
ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘గొట్చర్ ‘(Gotcher). 2015లో విడుదలైన ఈ అమెరికన్ షార్ట్ ఫిల్మ్ కు బ్రూస్ బ్రానిట్ దర్శకత్వం వహించారు. ఇది హారర్ జానర్‌లో రూపొందిన చిన్న మూవీ. చిన్నపిల్లల ముక్కులు కోసే ఒక వింత ఆకారం చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. డైలీ మోషన్ (Daily Mostion) లో ఇది అందుబాటులో ఉంది. ఇందులో మిచెల్ డేవిడ్‌సన్, డేవిస్ డీరాక్, డారెన్ కెన్నెడీ, జోహన్నా లీ వంటి నటులు వివిధ పాత్రలను పోషించారు.