BigTV English
Advertisement

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Manchu Vishnu.తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డూ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. శ్రీవారికి ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించే ఈ లడ్డూ లో గొడ్డు మాంసం ఉపయోగించబడిందనే వాదన తెరపైకి రావడంతో పలు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజా ప్రభుత్వం గత ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ దీనికి సరైన సమాధానం చెప్పాలి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా భక్తులు, ధార్మిక సంస్థలు కూడా ఈ విషయంపై మండిపడుతూ, సత్వర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి.


పవన్ కళ్యాణ్ కి అండగా.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్..

ఇదిలా ఉండగా ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) కూడా తన అధికారిక ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ కి ఇప్పుడు మరో నటుడు ,మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) సమాధానం ఇచ్చారు.మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ కి రీకౌంటర్ వేస్తూ.. గౌరవనీయులైన ప్రకాష్ రాజ్ దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తిరుమల లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు.. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలి అని కోరారు . ధర్మ పరిరక్షణ కోసం ఆయన తగిన చర్యలు కూడా తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటివారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో..? మత కల్లోలాల రంగు ఎవరు ఎప్పుడు ఎక్కడ పులుముతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకుంటే మంచిదేమో..దయచేసి మీ హద్దుల్లో మీరు ఉండండి అంటూ ఎక్స్ వేదికగా మంచు విష్ణు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ.. ప్రకాష్ రాజ్ కు రీకౌంటర్ ఇస్తూ మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.


Manchu Vishnu: Kalti Laddu.. Counter to Prakash Raj.. Vishnu who stood by Pawan Kalyan..!
Manchu Vishnu: Kalti Laddu.. Counter to Prakash Raj.. Vishnu who stood by Pawan Kalyan..!

ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ లో ఏముంది..

హద్దుల గురించి మంచు విష్ణు మాట్లాడుతుండడంతో అంతలా ప్రకాష్ రాజ్ ఎలాంటి పోస్ట్ చేశాడు అంటూ నెటిజన్స్ ఆరా తీయగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన ట్యాగ్ చేస్తూ.. మీరు ఉపముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమయంలో జరిగిన ఘటన ఇది. కాబట్టి దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరు ఎందుకు అనవసర భయాలు కల్పించి , దీనిని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు , మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన గొడవలు చాలు అంటూ పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్.

సత్వర పరిష్కారం చూపించాలి..

ఈ విషయంపైనే ప్రకాష్ రాజ్ ను రీ కోట్ చేస్తూ మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.. ఒకరకంగా చెప్పాలి అంటే ఇందులో ప్రకాష్ రాజ్ చెప్పింది భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదనే వాదన నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతోంది. లడ్డూ కల్తీ విషయంలో జరిగిన తప్పిదాలకు అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యి బాధితులను పట్టుకొని శిక్షిస్తే సరిపోతుంది. దీనిని జాతీయస్థాయిలో తీసుకెళ్లి ఏకంగా ప్రధానమంత్రి మోడీ వరకు కూడా వీటిని పంపించి, గత ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీ హయాంలో జరిగింది.. మీ హయాంలో ఇది వెలుగులోకి వచ్చింది. కాబట్టి సత్వర పరిష్కారం చేపట్టాలి అని నెటిజన్స్ సైతం సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ ను కార్నర్ చేయడమే లక్ష్యమా..

మా ఎలక్షన్స్ సమయంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఆ తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు షురూ అయ్యేలా ఉన్నాయే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మా ఎలక్షన్ సమయంలో ప్రకాష్ రాజ్ vs మంచు విష్ణుగా ఉండేది. కానీ, అప్పుడు ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ సపొర్ట్ గా నిలిచే వారు. అంతే కాదు, చాలా వేదికల్లో పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ సమర్థించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో మా ఎలక్షన్స్ కోసమే పవన్ కళ్యాణ్ సైడ్ మాట్లాడాడని, ఇప్పుడు మా ఎలక్షన్లు లేవు కాబట్టి, ఎప్పటి లాగే, పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ వ్యతిరికేస్తున్నాడు. అలాగే, పవన్ కళ్యాణ్ తో మంచు విష్ణు కూడా దూరంగానే ఉంటాడు. కానీ, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ను కార్నర్ చేయడానికి ఈ ట్వీట్ చేశాడని అర్థమవుతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×