Kannappa Making Video:ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. మేకర్స్ మేకింగ్ వీడియోలను వదులుతూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ‘ది బియాండ్ స్టోరీ’ అంటూ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ (NTR) ఎంత కష్టపడ్డారో చూపించారు. ఇక ఇటీవల ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ‘ఛావా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విక్కీ కౌశల్ (Vicky kaushal) ఇందులో రష్మిక మందన్న(Rashmika mandanna)హీరోయిన్గా నటించినది. భారీ అంచనాల మధ్య వచ్చి ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ ఎంత కష్టపడ్డారో అందుకు సంబంధించిన మేకింగ్ వీడియోని నిన్న మేకర్స్ విడుదల చేయగా.. సినిమాపై మరింత హైప్ పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు మేకింగ్ వీడియోలను రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారిన నేపథ్యంలో మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీగా మారిన కన్నప్ప(Kannappa) సినిమా నుండి కూడా మేకింగ్ వీడియోని తాజాగా విడుదల చేశారు మేకర్స్. అందులో ఒక పాట కోసం మంచు విష్ణు(Manchu Vishnu) పడిన కష్టాన్ని చూపించారు. ఇక మేకింగ్ వీడియోలో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం.
శివ శివ శంకర సాంగ్ మేకింగ్ వీడియో వైరల్..
అసలు విషయంలోకి వెళ్తే.. మంచు విష్ణు కన్నప్ప సినిమా నుండి ఇటీవల ఒక మంచి శివుడి పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సాంగ్ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. న్యూజిలాండ్ అడవుల్లో మంచు విష్ణు.. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhudeva) తో పాటు చిత్ర బృందం కష్టపడే విజువల్స్ ని మనకు ఇందులో చూపించారు. “శివ శివ శంకర” అంటూ సాగిన ఈ పాట వెనుక మంచు విష్ణు కష్టం ఏ రేంజ్ లో ఉందో మనకు చూపించడం జరిగింది. ఇకపోతే కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. ముఖ్యంగా ఆయన ఎలా చేయాలో చూపిస్తూ ఉండగా అందుకు తగ్గట్టుగానే మంచు విష్ణు కూడా చేయడం మనం చూడవచ్చు. ఇక పాట చివర్లో మంచు విష్ణు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కాళ్ళు మొక్కడం కూడా మనం చూడవచ్చు.
కనీసం ఇదైనా సినిమాపై హైప్ పెంచుతుందా..?
ఇకపోతే మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం భాగం అయింది. ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohan babu) ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా.. ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ (Prabhas ), అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, తోట ప్రసాద్ కథను అందించగా.. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి స్టార్ సెలబ్రిటీల పాత్రలను పరిచయం చేస్తూ.. రిలీజ్ చేసిన పోస్టర్స్ పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాయి. కనీసం ఈ మేకింగ్ వీడియో అయినా సినిమాపై హైప్ పెంచుతుందేమో చూడాలి.