BigTV English

Journalist Jaffer: మీనాక్షి చౌదరి పేరు చెప్పి.. ఊరిని మోసం చేసిన జర్నలిస్ట్ జఫర్

Journalist Jaffer: మీనాక్షి చౌదరి పేరు చెప్పి.. ఊరిని మోసం చేసిన జర్నలిస్ట్ జఫర్

Journalist Jaffer: “దేవో మనుష్య రూపేణ” సంస్కృతంలో ఉన్న ఈ మాటకు గురించి కొత్తగా అర్థం చెప్పాల్సిన పనిలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా టైటిల్ లో ఇది కనిపిస్తుంటుంది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ ఇప్పటికీ ఆ సినిమాకి ఒక మంచి స్టేటస్ ఉంది. దేవుడు అంటే మనిషి రూపంలోనే వస్తాడు అని త్రివిక్రమ్ చెప్పిన విధానం అప్పట్లో చాలామందికి కనెక్ట్ కాలేదు. కానీ ఇప్పటికీ ఆ సినిమా ఒక క్లాసిక్. అలానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కృష్ణం వందే జగద్గురు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమాలో కూడా దేవుడు మనిషి రూపంలోనే ఉంటాడు అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ ఆ సినిమాలో బాగా ఫేమస్. దేవుడంటే సాయం అని రాసిన మాట ఎవరు మర్చిపోలేరు.


ఇక అసలు విషయానికి వస్తే “ప్రకాశం జిల్లా మండలాల సంఖ్య 56. వీటిలో 46 ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలే. అంటే దాదాపు 82 శాతం మండలాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. తాగే నీటిలో లీటరుకు 1.5 మిల్లీగ్రాముల వరకు ఫ్లోరైడ్ ఉండొచ్చు. అంతకు మించితే ఆరోగ్యానికి ప్రమాదం. కానీ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ 1.5 నుంచి 10 మిల్లీగ్రాముల మధ్య ఉంది. కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, దర్శి, చీమకుర్తి, మార్కాపురం వంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం చాలా ఎక్కువ. ప్రకాశం జిల్లాలో వానలు చాలా తక్కువ. చెప్పుకోదగ్గ నదులు కానీ, ప్రాజెక్టులుగానీ లేవు. భూగర్భజలాలపై ఆధారపడటం తప్ప ప్రజలకు మరో మార్గం లేదు. ఇన్ని సమస్యలు అక్కడ ఉన్నాయి, అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు జర్నలిస్ట్ జాఫర్.

జాఫర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఎన్నో కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేశాడు. అలానే బిగ్ బాస్ అనే షో ద్వారా మంచి గుర్తింపు కూడా సాధించుకున్నాడు. చాలా ముక్కు సూటిగా ప్రశ్నలు అడుగుతుంటారు జాఫర్. ఇప్పుడు కనిగిరిలో జాఫర్ చేసిన ప్లాన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రకాశం జిల్లా ప్రాంతానికి చెందిన దర్శకుడు అనిల్ రావిపూడి. తనతో ఒక సందర్భంలో ఇంటర్వ్యూ చేస్తూ ఈ అంశాలను లేవనెత్తాడు జాఫర్. వాటి గురించి పాజిటివ్ గానే స్పందించాడు అనిల్ రావిపూడి. అయితే ఈ వీడియోను బేస్ చేసుకుని. ఆ ప్రాంతానికి మీనాక్షి చౌదరి వస్తుంది అని అంతమందిని నమ్మించాడు జాఫర్.


ఒక సెలబ్రిటీ ని మామూలుగా ప్రేక్షకులు చూసే క్యూరియాసిటీ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతే క్యూరియాసిటీతో మీనాక్షి చౌదరిని చూడటానికి చాలా మంది అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను ఒక పెద్ద ట్విస్ట్ తో వివరించి చెప్పాడు జాఫర్. మీనాక్షి చౌదరి వస్తుంది అని జాఫర్ అబద్ధం చెప్పినా కూడా అక్కడ సమస్యను డీల్ చేసిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి ఇది జాఫర్ చేసిన గొప్ప పనిలో ఒకటి అని చెప్పొచ్చు. దీనిలో కేవలం మీనాక్షి చౌదరి మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా ఇన్వాల్వ్ చేశారు జాఫర్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Actor Dhanaraj: వేదికపై ‘జబర్దస్త్’ ధనరాజ్ భావోద్వేగం.. ఆ విషయం చెబుతూ..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×