E-Paper
Advertisement

Kannappa Teaser: ప్రతి షాట్ కూడా అద్భుతమే.. అదిరిపోయిన కన్నప్ప టీజర్

Kannappa Teaser: ప్రతి షాట్ కూడా అద్భుతమే.. అదిరిపోయిన కన్నప్ప టీజర్
Advertisement

Kannappa Teaser: ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. మంచి విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ & AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అతిరథమహారథులు నటిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇప్పటివరకు పోస్టర్స్, స్టార్స్ షూటింగ్ ఫొటోస్ తోనే హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కన్నప్ప టీజర్.. విజువల్ వండర్ గా ఉంది. ఖర్చుకు మొహమాటపడకుండా మోహన్ బాబు నిర్మించినట్లు తెలుస్తోంది. మైథలాజికల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తోనే మరింత ఆసక్తిని పెంచేశారు.

Advertisement

” కాలముఖ.. వాయు లింగాన్ని పికిలించుకొని రమ్మని నువ్వు పంపిన 50 మందిని.. నీ తమ్ముదు టెంగన్నతో సహా అందరిని చంపేశాడు” అనే ఒక రాక్షస జాతికి చెందిన వ్యక్తి చెప్తుండగా టీజర్ మొదలయ్యింది. ఒకపక్క అతను చెప్తుండడం.. ఇంకోపక్క హీరో ఇంట్రడక్షన్ చూపించడం ఆకట్టుకుంది. వందమంది కూడా కలిసి చంపలేని రాక్షసుడును తిన్నడు( మంచు విష్ణు) చంపినట్లు తెలిపి అతడి బలం ఎలాంటిదో మచ్చుకు చూపించారు.

ఇక టీజర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశారు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ సైతం యాక్షన్ పార్ట్ లో భాగమైనట్లు కనిపిస్తుంది. ఇక స్టార్ క్యాస్టింగ్ మొత్తాన్ని సింగిల్ షాట్ లో చూపించడానికి ప్రయత్నించారు. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్.. ఇక టీజర్ మొత్తానికి హైలైట్ గా ప్రభాస్.. ఆ కళ్లు చూపించి షేక్ చేసేశారు.

Advertisement

మొట్ట మొదటిసారి థియేటర్ లో శివుడు కనిపించినా కూడా నందీశ్వరుడునే అభిమానులు చూస్తూ ఉండడం జరుగనుంది. టోటల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్ వండర్ గా కన్నప్ప టీజర్ ఉంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×