BigTV English

Chandrababu Mark Rule In AP: మొదలైన చంద్రబాబు మార్క్ పాలన!

Chandrababu Mark Rule In AP: మొదలైన చంద్రబాబు మార్క్ పాలన!

Chandrababu Mark Rule In Andhra Pradesh: మొదలైన చంద్రబాబు మార్క్ పాలన! ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. ఈ ఐదు ఫైళ్లతోనే ఏపీలో ఎన్డీఏ పాలన మొదలు కానుంది. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు ఓ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఎందుకంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేదానిపై ఆయనకు కూడా పూర్తిగా క్లారిటీ లేదు.


ఐదేళ్లు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. ప్రభుత్వానికి ఉన్న అప్పులు? ప్రభుత్వ ఆస్తుల తాకట్టులు.. ప్రభుత్వ నడిపించడానికి ఉన్న వనరులపై పూర్తి స్పష్టత వచ్చి ఉండదు. ఆ క్లారిటీ రావాలంటే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. కానీ.. అవేవీ ఆలోచించకుండా ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఐదు సంతకాలు చేశారు. అయితే.. ఆ ఐదు సంతకాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వానికి భారం కావొచ్చు కానీ.. సంక్షేమంతో పాటు అభివృద్ధి, సామాన్యులకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు.. మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై చేశారు. 16వేలకు  పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయిని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఉద్యోగ కల్పనపై మొదటి సంతకం నిజంగా ప్రశంసనీయమైన విషయం. ఎప్పటి నుంచో ఉన్న నిరుద్యోగులకు ఓ దారి దొరికినట్టు అవుతుంది. పైగా డీఎస్సీని ఉద్యోగ కల్పనగానే కాకుండా విద్యావ్యవస్థ బలోపేతంగా కూడా చూడాలి. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై చేశారు.


వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వ్యతిరేకత మాత్రమే కాదు.. ప్రజలు తమ భూములకు రక్షణ లేదని భావించారు. వైసీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ఈ చట్టమనే చెప్పాలి. దీన్ని రద్దు చేస్తూ చంద్రబాబు రైతులకు భరోసా కల్పించారు. ఇక తర్వాత సామాజిక పింఛన్లు పెంపు. ఇకపై వృద్దులకు నాలుగు వేలు, వికలాంగులకు ఆరు వేల రూపాయల పించను అందుకోనున్నారు. ఇది ప్రభుత్వానికి కొంతమేర భారమైనప్పటికీ చంద్రబాబు డేరింగ్ స్టెప్ తీసుకున్నారనే చెప్పాలి.

ఆ తర్వాత అన్నా క్యాంటిన్లు పునరుద్దరణపై సంతకం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్నా క్యాంటిన్లు పెట్టి ఐదు రూపాయలకే భోజనం అందించారు. అయితే.. 2019లో జగన్ వచ్చి వాటిని రద్దు చేశారు. రోజువారీ కూలీలు, తక్కువ జీతం ఉన్నవారికి మధ్యాహ్నం ఈ అన్నా క్యాంటిన్లు బాగా ఉపయోగపడతాయి. వారిపై ఆర్థిక భారం తగ్గుతుంది. అందుకే దీనిపై చంద్రబాబు నాలుగో సంతకం చేశారు.

Also Read: ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలివే.. పవన్ చేతికి కీలక శాఖలు

చివరిగా చంద్రబాబు మార్క్ సిగ్నేచర్ ఐదో ఫైలుపై చేశారు. యువతకు ఉద్యోగాలు ఉండాలి. కానీ, ఉద్యోగం ఉండాలంటే వారికి ఏ ఫీల్డ్ లో నైపుణ్యం ఉందో తెలుసుకోవాలి. చాలా మంది గ్రాడ్యూవేషన్ పూర్తి చేసిన తర్వాత ఎటు వైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతారు. తమకు ఉన్న నైపుణ్యం ఏంటో తెలుసుకోలేరు. పక్కవాళ్లను చూసి కోచింగ్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృధా చేస్తారు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా  చంద్రబాబు నైపుణ్య గణన అనే హామీ ఎన్నికల్లో ఇచ్చారు.

దీని ద్వారా ఎవరిలో ఏ స్కిల్ ఉందో గుర్తిస్తారు. తర్వాత దానికి తగ్గట్టు శిక్షణ ఇస్తారు. అప్పుడు ఉపాధి సులభంగా లభిస్తుంది. నిరుద్యోగాన్ని తగ్గించాలంటే.. నేరుగా కంపెనీలు తీసుకొని రావడం, ఉద్యోగాలు కల్పించడం ఒక్కటే మార్గం కాదు. ఎవరు ఏ ఉద్యోగం చేస్తే ఆ వ్యక్తుల్లో అభివృద్ధి ఉంటుంది? ఆ అవుట్ పుట్ బాగుంటుందనేది గ్రహించాలి. ఇదే విషయంపై చంద్రబాబు పోకస్ చేశారు. దీని కోసం ఐదో సంతకం పెట్టారు. మొత్తానికి చంద్రబాబు ఓటర్లను ప్రసన్నం చేయడమే లక్ష్యంగా కాకుండా.. ఓవైపు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే భవిష్యత్ తరాలకు బాటలు వేసే నిర్ణయాలు తొలిరోజే తీసుకున్నారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×