Manchu Vishnu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు అందరినీ మంచి ఎంటర్టైన్ చేస్తున్నాయని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం ‘కన్నప్ప’ (Kannappa )సినిమా గురించి కొంతమంది యూట్యూబర్స్.. తమ యూట్యూబ్ ఛానెల్స్ లో అసత్య ప్రచారాలు చేయగా.. మా(MAA )అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఆయా ఛానెల్స్ ని బ్లాక్ చేయించారు. దీంతో అలాంటి వారు ఇప్పుడు ఈ గొడవలకు ఊహించని థంబ్ నెయిల్స్ పెట్టి పబ్లిష్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. దీనిపై మంచు విష్ణు మండిపడిన విషయం తెలిసిందే. మీడియాలో 90 శాతం మంది మంచి మిత్రులే ఉన్నారు కానీ ఆ 10 శాతం మంది మా కుటుంబం ఎప్పుడెప్పుడు గొడవలు పడుతుందా? ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ చేయాలా? అని ఎదురు చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశాలకు షిఫ్ట్ అవడంపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు..
దీనికి తోడు మంచు విష్ణు భార్యా, పిల్లలతో కలిసి దుబాయ్ లో సెటిల్ అయిపోయాడు అందుకే ఇక్కడ జరుగుతున్న గొడవలను పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా స్పందించిన ఆయన తాను ఏ దేశానికి పారిపోలేదు అంటూ కామెంట్లు చేశారు. తాజాగా ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు విష్ణు అందులో మనోజ్ (Manoj ) కి భయపడి విష్ణు దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు అని వార్తలు వస్తున్నాయి.. పిల్లలను విదేశాలలో చదివిస్తున్నారు అని, అందుకే మీరు కూడా వెళ్లిపోయారని అంటున్నారు నిజమేనా?అని ప్రశ్నించగా దీనికి మంచు విష్ణు సమాధానం ఇస్తూ.. “నేను ఎక్కడికి షిఫ్ట్ కాలేదు. నా పిల్లలకు నార్మల్ చైల్డ్ హుడ్ ఉండాలని మాత్రమే నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్లు ఇక్కడ చాలా ప్రొటెక్ట్గానే ఉన్నారు. సినీ పరిశ్రమకు దూరంగానే వారిని చదివిస్తున్నాను. వాళ్లు సంతోషంగా బయట తిరగాలి. వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరూ ఫోటోలు తీసుకోకూడదు. వారు సింపుల్గా బస్సులో వెళ్లాలి. అందుకే అక్కడ చదివిస్తున్నాను. నేను విదేశాలకు వెళ్తే.. అక్కడ నార్మల్ మ్యాన్
నాకు అదే నచ్చుతుంది కూడా.. ముఖ్యంగా నాకు స్టార్ అవ్వాలని ఉన్నా ఇక్కడ ప్రైవసీ ఉండదు. నేను తిరుపతి, హైదరాబాదులోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను.. నేను ఈ జన్మలో ఎవరికీ కూడా భయపడను” అంటూ మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.
అన్న పై ఆరోపణలు చేస్తున్న మంచు మనోజ్..
ఇక ఇదిలా ఉండగా నిన్నటికి నిన్న మోహన్ బాబు (Mohan babu ) జల్పల్లి తన ఫామ్హౌస్ తో పాటు తన కష్టంతో సంపాదించిన ఆస్తులను కొంతమంది కాజేశారని, వెంటనే వారిని వెకేట్ చేయించాలని జిల్లా కోర్టులో వినతి పత్రాలు సమర్పించగా.. రంగంలోకి దిగిన ఆ జిల్లా కలెక్టర్ మనోజ్ ని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి నుండి ఖాళీ చేయమని నోటీసులు పంపించారు. ఈ మేరకు మనోజ్ కూడా కలెక్టరేట్ కి వెళ్లి మాట్లాడడం జరిగింది. బయటకు వచ్చిన మనోజ్ మాట్లాడుతూ.. ఆస్తి గొడవలు కాదు. ఇవి మా కాలేజీ విద్యార్థులకు, తిరుపతి దగ్గర మా ఊర్లోని ప్రజలను మోసం చేస్తున్నారు. దానికి మా అన్న వెనకుండి ఇదంతా చేయిస్తున్నాడు అంటూ కామెంట్లు చేశారు మనోజ్.