BigTV English
Advertisement

Manchu Vishnu: అన్ని కోట్లతో సినిమా తీసి.. VFX వర్క్ కొరియర్ చెయ్యడం ఏమిటీ? విష్ణు వివరణ ఇదే

Manchu Vishnu: అన్ని కోట్లతో సినిమా తీసి.. VFX వర్క్ కొరియర్ చెయ్యడం ఏమిటీ? విష్ణు వివరణ ఇదే

Manchu Vishnu: మంచు విష్ణు(Vishnu) కన్నప్ప (Kannappa)సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక సంచలనమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఒక హార్డ్ డిస్క్(Hard Disk) మిస్ అయిందని వార్త బయటకు రావడంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇప్పటివరకు ఏసినిమాకు సంబంధించి ఇలా హార్డ్ డిస్క్ లు మిస్ అవ్వడం జరగలేదు, మొదటిసారి కన్నప్ప సినిమాకు ఇలా జరగడంతో ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారని అందరూ భావించారు. ఇక ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం వెనుక రఘు, చరిత అనే వ్యక్తులు ఉన్నారని ఈ ఇద్దరి పేర్లు కూడా బయటకు వచ్చాయి.


ఇక ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న మంచు విష్ణుకి ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. హార్డ్ డిస్క్ మిస్ కావడంతో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాతే ఈ విషయం బయటకు వచ్చిందని మంచు విష్ణు తెలిపారు. మరి ఈ హార్డ్ డిస్క్ దొరికిందా? అని ప్రశ్నించడంతో ఇప్పటికీ దొరకలేదని మంచు విష్ణు తెలిపారు. వెంటనే కొన్ని వందల కోట్లు పెట్టి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ ను విఎఫ్ఎక్స్ కంపెనీవారు కొరియర్ చేయడం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది.

రఘు, చరిత..
ఈ ప్రశ్నకు విష్ణు సమాధానం చెబుతూ ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కోసం ముంబైలో 8 కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. అందులో హైవ్ అనే కంపెనీ ఆన్లైన్ లో ఫస్ట్ పాస్ పంపించారు అందులో జిట్టస్ వచ్చాయి. సెకండ్ టైం పంపించినప్పుడు అంత బాగుంది. ఫైనల్ గా ఎలాంటి సమస్యలు లేకుండా ఒక కాపీని కంపెనీ వాళ్ళు మాకు కొరియర్ చేశారు. అయితే కొరియర్ మా ఆఫీస్ అడ్రస్ కి పంపించకుండా జిఎస్టి రిజిస్టర్ కు పంపించారు.ఆ అడ్రస్ ఫిలింనగర్ లో నాన్నగారి ఇల్లు. ప్రజెంట్ నాన్న అక్కడ లేరు, అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు. ఇక మాకు సంబంధించిన ఏ కొరియర్ వచ్చిన అక్కడికే వెళ్తాయి. తరువాత మా మేనేజర్లు వెళ్లి కొరియర్ తీసుకువస్తారు. ఈ కొరియర్ వచ్చిన సమయానికి అక్కడ రఘు అనే వ్యక్తి ఉన్నారు.


పైరసీ చేయకుంటే మంచిది…

రఘు అనే వ్యక్తి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పైన ఒక కొరియర్ వచ్చిందని చెప్పగానే చరిత అనే అమ్మాయి వెంటనే మాకు పంపించండి అని చెప్పారు. వాళ్ళిద్దరూ మనోజ్ దగ్గర పని చేస్తున్నారని తెలిసింది. ఇక ఇదే విషయం గురించి పోలీసులకు కూడా కంప్లైంట్ చేశామని వాళ్లు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు మాకైతే హార్డ్ డిస్క్ ఇవ్వలేదు కానీ దానిని పైరసీ చేయకుండా ఉంటే చాలు అంటూ విష్ణు తెలిపారు..

విద్యాసంస్థలు ఒక ట్రస్ట్…

ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు మరో ప్రశ్న ఎదురయింది. మంచు కుటుంబం విద్యాసంస్థలలో సంపాదించిన డబ్బంత సినిమాలలో పాడు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది మరి ఈ విషయంపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విష్ణు సమాధానం చెబుతూ.. నేను నా సొంత బ్యానర్ లో మోసగాడు, జిన్నా అనే సినిమాలు మాత్రమే చేశాను అంతకుముందు ఇతర బ్యానర్లలోనే సినిమాలు చేశాను. ఇక సినిమా కోసం ఎంతోమంది కార్మికులు కష్టపడతారు వారి కోసం ఖర్చు చేసిన డబ్బు పాడు చేయడం ఏంటి? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అలాగే శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలన్నీ కూడా ఒక ట్రస్ట్ అని అందులో నుంచి రూపాయి వాడుకున్న నన్ను ఎత్తి బొక్కలో వేసి ఏడూర్లు పరిగెత్తిస్తారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పక్కకు మళ్ళించడానికి అవకాశం లేదని విష్ణు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×