Hard Disk: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా అదే విధంగా నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా మంచు విష్ణు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి ఒక హార్డ్ డిస్క్(Hard Disk) మిస్ కావడం గురించి కూడా మంచు విష్ణు ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
హార్డ్ డిస్క్ పంపిస్తున్నట్లు తెలియదు…
ఈ సినిమాకు సంబంధించి ఒక హార్డ్ డిస్క్ మిస్ అయ్యిందని, ఆ హార్డ్ డిస్క్ లో ప్రభాస్(Prabhas) కి సంబంధించిన సన్నివేశాలు మొత్తం ఉన్నాయని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి ఈ వార్తలపై మీ స్పందన ఏంటనే ప్రశ్న మంచు విష్ణుకి ఎదురయింది. ఇక ఈ విషయం గురించి మంచి విష్ణు మాట్లాడుతూ కన్నప్ప సినిమా కోసం ముంబైలో దాదాపు 8 విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు.. అయితే అందులో ఒక కంపెనీ సినిమాకు సంబంధించి ఒక హార్డ్ డిస్క్ మాకు పంపించారు. అది ఫైనల్ కాపీ కాదు కానీ ఒకసారి మేము చూడటం కోసం మాకు పంపించారు.
నాన్న ఇంటికే వెళ్తాయి…
ఇలా హార్ట్ డిస్క్ పంపిస్తున్నట్టు ఆ కంపెనీ నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన మేము జాగ్రత్త పడే వాళ్ళం. ఇక మా ఇంట్లో ఏదైనా కొరియర్ వచ్చింది అంటే నాన్న గారి ఇంటికే వెళ్తాయి. అక్కడి నుంచి ఆ కొరియర్ ఎవరికైతే వచ్చిందో వారికి చేరుతుంది. హార్డ్ డిస్క్ కూడా నాన్న ఇంటికి డిటిడిసి కొరియర్ ద్వారా వచ్చిందని విష్ణు తెలిపారు. ఇక ఆ హార్డ్ డిస్క్ ఓపెన్ చేయటానికి వీలు లేకుండా పాస్ వర్డ్ పెట్టి ఫుల్ సెక్యూరిటీతో పంపించారు. ఇక నాన్నగారి ఇంటికి వెళ్లడంతో అక్కడ రఘు అనే వ్యక్తి చరిత అనే ఆమెకు ఫోన్ చేసి ఇలా పార్సిల్ వచ్చిందని చెప్పడంతో తీసుకోమని చెప్పారట. అయితే వీరిద్దరూ మనోజ్ దగ్గర పని చేస్తున్నారు. అలా ఆ హార్డ్ డిస్క్ మిస్ అయిందని విష్ణు తెలిపారు.
ఇప్పటివరకు ఈ హార్డ్ డిస్క్ మా చేతులలోకి రాలేదు. మరి అది ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలను పోలీసులు చూస్తున్నారని, ఈ విషయంపై తాము పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చామని మనోజ్ తెలిపారు.. ఇలా హార్ట్ డిస్క్ మిస్ కావటం సినిమాకు మైనస్ కాదా? అనే ప్రశ్న కూడా ఎదురయింది. ఆ హార్డ్ డిస్క్ పాస్ వర్డ్ ఉండటంతో సమస్య ఏమీ కాదని, అందులో ఉన్న కంటెంట్ బయట పెట్టకపోతే సినిమాకు కూడా ఎలాంటి సమస్య రాదు అంటూ విష్ణు ఈ సందర్భంగా హార్డ్ డిస్క్ మిస్సింగ్ గురించి పూర్తి వివరాలను తెలియజేశారు. ఇక ప్రభాస్ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ పాత్రను ఎంజాయ్ చేస్తారని విష్ణు మరోసారి ప్రభాస్ పాత్ర గురించి చెబుతూ అభిమానులలో అంచనాలను పెంచారు .