BigTV English

Electric Vehicles: తెలంగాణలో ఈవీ వాహనాల జోరు.. 80 శాతం బైక్‌లే

Electric Vehicles: తెలంగాణలో ఈవీ వాహనాల జోరు.. 80 శాతం బైక్‌లే

Electric Vehicles: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల-ఈవీ వాహనాల జోరు మొదలైంది. ఈ తరహా వాహనాల సంఖ్య క్రమంగా పెరగుతున్నాయి. ముఖ్యంగా యూత్ దృష్టి ఆయా వాహనాలపై పడ్డాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దాదాపుగా రెండు లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.


తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య రెండు లక్షల మైలురాయిని తాకింది. మార్చి 31 నాటికి తెలంగాణలో 1.96 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయి. ఈ విషయాన్ని రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ నెలలో రెండు లక్షల మార్క్‌ని క్రాస్ చేయడం ఖాయమని అంటున్నారు.

అమ్ముడైన ఎలక్ట్రిక్‌ వాహనాల్లో అత్యధికంగా అంటే 80 శాతం ఈవీ బైక్‌లు ఉన్నాయి. మిగతా 20 శాతం కార్లు, బస్సులు ఉన్నట్లు అధికారుల మాట. ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల యజమానులతోపాటు పర్యావరణానికీ మేలు జరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌ వాటితో పోలిస్తే ఛార్జింగ్‌ ద్వారా ఖర్చు ఆదా అవుతోందని అంటున్నారు.


దేశంలో పెరుగుతున్న కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజులపై ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీంతో వాహనదారులు అటువైపు దృష్టిసారించారు. వచ్చేఏడాది డిసెంబరు 31 వరకు ఈవీ పాలసీ అమల్లో ఉండనుంది. ఈక్రమంలో వ్యక్తిగత వాహనాలు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ALSO READ: ఖాతాదారులకు అలర్ట్, ఈ మార్పులు తెలుసుకోండి

ప్రయాణికులను చేర వేయడంలో ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ బస్సులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. 2022-23 లెక్కల ప్రకారం.. తెలంగాణలో కోటిన్నర పైగా వాహనాలు ఉన్నాయి. అందులో టూ వీలర్స్ కోటి 13 లక్షలు కాగా, మిగతా కార్లు ఉన్నాయి. ఈ లెక్కన చూసుంటే ఈవీలపై ప్రజలు ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు కొందరు అధికారులు.

వినియోగదారులు వాడుతున్న వాహనాలకు సంబంధించిన కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లోకి తీసుకురాలేదని అంటున్నారు.  ఆయా కంపెనీలు ఈవీలను దించి ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇస్తే ఈవీల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్  ఉందంటున్నారు. ఈవీలకు ఛార్జింగ్‌ స్టేషన్ల కొంత సమస్యగా మారిందని అంటున్నారు.

హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లున్నాయి. రూరల్, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో వాటి సమస్య ఉంది. ఎలక్ట్రిక్​ వాహనాలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో 800 ఛార్జింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇంటి నుంచి బయలు దేరినప్పుడు ఛార్జింగ్‌ మధ్యలో అయిపోతే తమ పరిస్థితి ఏంటన్నది కొందరి మాట.  ఈ కారణంగానే ఆయా వాహనాలపై మొగ్గు చూపడం లేదని అంటున్నారు.

ఈ ఏడాది చివరికి ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్యను 3,000 పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం.  2030 నాటికి 6,000 ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2035 సంవత్సరం నాటికి 12,000కు పెంచాలన్నది ఆలోచన.  పెట్రోల్ బంకుల మాదిరి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెరిగితే ఈవీలకు పెరగవచ్చని అంటున్నారు.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×