BigTV English

Lakshmi Narasimha: మణిశర్మ సంగీతంలో పస తగ్గిందా.. అందుకే భీమ్స్ ఎంట్రీ ఇచ్చారా?

Lakshmi Narasimha: మణిశర్మ సంగీతంలో పస తగ్గిందా.. అందుకే భీమ్స్ ఎంట్రీ ఇచ్చారా?

Lakshmi Narasimha: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్(Re Release) సినిమాలు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన సినిమాలను తిరిగి వారి పుట్టినరోజును పురస్కరించుకొని థియేటర్లలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త సినిమాలకు పోటీగా ఇలా పాత సినిమాలను కూడా తిరిగి విడుదల చేయడంతో కొత్త సినిమాల కలెక్షన్ల పై కొంత ప్రభావం చూపిస్తోందని ఇప్పటికే పలువురు నిర్మాతలు సెలబ్రిటీలు కూడా ఈ విషయం గురించి స్పందించారు. అందుకే ఈ రీ రిలీజ్ సినిమాలు వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నారు.


ఇకపోతే జూన్ నెలలో పెద్ద ఎత్తున రీ రిలీజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఇలా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన లక్ష్మీనరసింహ(Lakshmi Narasimha) సినిమా ఒకటి. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు జయంత్ సి ఫర్జానీ దర్శకత్వం వహించగా, బాలకృష్ణ ఆసిన్ హీరో హీరోయిన్లుగా నటించిన సందడి చేశారు. ఈ సినిమా 2004 జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

మందేసినోడు..


ఇకపోతే తాజాగా ఈ సినిమా బాలకృష్ణ పుట్టిన రోజు (Birth Day)సందర్భంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. జూన్ 10వ తేదీ బాలయ్య పుట్టినరోజు కావడంతో రెండు రోజులు ముందు అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక రీ రిలీజ్ సినిమాలలో కూడా లక్ష్మీనరసింహ సినిమా మరొక ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమా తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మందు తాగినోడు మహానుభావుడు అంటూ ఒకసారి కొత్త పాటను జోడిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సాంగ్ విడుదల చేస్తూ చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

మణిశర్మ దూరం…

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్(Bheems) పాల్గొన్నారు. నిజానికి లక్ష్మీనరసింహ సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మ (Mani sharma)పనిచేశారు. అయితే ఇప్పుడు మందేసినోడు పాట కోసం మణిశర్మను కాకుండా భీమ్స్ ను తీసుకోవడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురైంది.. ఈ ప్రశ్నకు నిర్మాత బెల్లంకొండ సురేష్ సమాధానం చెబుతూ… కేవలం మేము రిక్వెస్ట్ చేయడంతోనే భీమ్స్ ఈ పాట కోసం పని చేశారని తెలిపారు. మణిశర్మ గారు కూడా అద్భుతమైన పాటలను సంగీతాన్ని అందించారు కానీ ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా ఈ పాటకు భీమ్స్ అయితే సరిపోతుందన్న ఉద్దేశంతో, మేము రిక్వెస్ట్ చేస్తేనే ఆయన బాగమయ్యారు తప్ప ఇందులో మరొక ఉద్దేశం లేదు అంటూ సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఇలా రీ రిలీజ్ లో ఒక పాటను జోడిస్తూ లక్ష్మీనరసింహ సినిమా మరొక ట్రెండ్ సృష్టించిందని చెప్పాలి. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×