BigTV English

Mangalavaram OTT : సాలిడ్ రేట్ కు మంగళవారం ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Mangalavaram OTT : సాలిడ్ రేట్ కు మంగళవారం ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Mangalavaram

Mangalavaram OTT : ఆర్ఎక్స్ 100 మూవీ తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి..ఇప్పుడు అదే మూవీ హీరోయిన్ తో కలిసి తరికేకిస్తున్న చిత్రం మంగళవారం. లక్కీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో కలిసి అజయ్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. మంగళవారం మూవీ శుక్రవారం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ చిత్రం పై ఆసక్తిని రేపింది.. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన డిజిటల్ ప్రీమియం హక్కులు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది.


ఒకప్పుడు హీరోయిన్స్ అంటే సినిమాలో పాజిటివ్ రోల్ చేయడంతో పాటు ఎంతో సాఫ్ట్ గా ఉండేవారు. అయితే అవసరాన్ని బట్టి న్యాయం కోసం శ్రవణ్ గా నిలబడే తత్వం కూడా హీరోయిన్లు ఎక్కువగా చూపించేవారు. కానీ ఆర్ఎక్స్ 100 చిత్రం పుణ్యమా అని హీరోయిన్స్ లో కూడా నెగటివ్ రోల్స్ ఉంటాయి అనేది రుజువయింది. ఈ మూవీ వచ్చిన తర్వాత నిజంగా అమ్మాయిలు ఇలా ఉంటారా అని అందరూ నోరెళ్ల బెట్టారు. వినూతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించే క్లిక్ అవ్వడంతో ఈ చిత్రంతో అజయ్ భూపతి స్టార్ డైరెక్టర్ రేంజ్కి ఎదిగాడు.

మరోపక్క ఈ మూవీలో హీరోయిన్గా నటించిన పాయల్ రాజ్ పుత్ బోల్డ్ హీరోయిన్ గా కుర్ర కారు మది దోచుకుంది. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించినప్పటికీ పాయల్ కు ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఇక ఏ మూవీ తర్వాత శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన మహాసముద్రం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని తన లక్కీ హీరోయిన్ తో మంగళవారం అంటూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. 


రిలీజ్ చేసిన ట్రైలర్, పాటలలో పాయల్ రాజ్ అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంది. ఈ బ్యూటీ మరొకసారి బోల్డ్ సీన్స్ లో తనదైన స్టైల్ లో రెచ్చిపోయింది. దీంతో మూవీ పై రిలీజ్ కి ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి.

నందితా శ్వేతా, దివ్యా పిళ్ళై, అజేయ గోష్, కృష్ణ చైతన్య, రవీంద్ర విజయ్ ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఆన్లైన్ సంస్థ ఆహా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. భారీ ఈ మూవీస్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది.. అయితే ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు. 

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×