Manchu Manoj : మంచు మనోజ్ (Manchu Manoj).. దాదాపు 9 ఏళ్ల తర్వాత విజయ్ కనకమేడల( Vijay Kanakamedala) దర్శకత్వంలో ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో మంచు మనోజ్ మరొకసారి కులం గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇది విన్న చాలామంది ఫ్యామిలీ ఎఫెక్ట్.. మళ్లీ రెండోసారి కులం మార్చిన మంచు అన్న.. ఏకంగా ఈసారి ఏ కులం అంటే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. భైరవం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొన్న ఇంటర్వ్యూలో పాల్గొని.. మన కులం “ప్రేమికులం” అంటూ తన కులం గురించి చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఎన్నో ఎత్తు పల్లాలు చూసా – మంచు మనోజ్
అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ కులాన్ని మరో కులంగా చెప్పుకున్నారు మనోజ్. మనోజ్ మాట్లాడుతూ.. ” చాలా రోజుల తర్వాత నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడం సంతోషంగా ఉంది. నారా రోహిత్ (Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) తో కలిసి పనిచేసినందుకు మరింత హ్యాపీగా ఉంది. మేము ముగ్గురం బ్రదర్స్ లాగా ఉంటాం. ఈ సినిమాతో మా బంధం ఇంకా బలంగా మారింది. అది కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్నో సినిమాలు చేసి , ఎన్నో చూసి, గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాను. ఆ గ్యాప్ లో ఎన్నో సమస్యలు, ఎత్తు పల్లాలు, సక్సెస్ లో ఉన్నప్పుడు పక్కన ఉండడం వేరు.. కష్టాల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో నా స్టాఫ్ నాకు అండగా నిలబడింది. అందరికీ రుణపడి ఉంటాను.
మళ్లీ కులం మార్చిన మంచు మనోజ్..
“నలుగురు ఒకే కులానికి చెందిన వ్యక్తులు కలిసి సినిమా చేస్తున్నారని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్క కులానికి చెందినది కాదు. సినిమా అనే కళామతల్లి తన మతాన్ని చూడదు. కులం చూడదు. గోత్రం కూడా చూడదు. మా కులం సినిమా కులం. నా గుడి సినిమా థియేటర్. సినిమా తెగేటప్పుడు ఇది కాపు సినిమానా? రెడ్డి సినిమానా? కమ్మ సినిమానా? హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేది ఎవరూ చూడరు. హీరో ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన క్యాస్ట్ ఏంటి? అని చూడరు. తెలుగు మూవీ లవర్స్ టాలెంట్ ఉంటే ఎక్కడివారినైనా తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు.అంత గొప్ప ఇండస్ట్రీ మనది. తెలంగాణకు చెందిన సందీప్ రెడ్డివంగానే జాట్, కపూర్ అని చూసి బాంబేలో నెత్తిన పెట్టుకోలేదు కదా. ఇండియన్ సినిమాలు టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు. హార్డ్ వర్క్, టాలెంట్ ఉంటే మన నిర్మాతలు మనల్ని నెత్తిన పెట్టుకుంటారు. కులం, మతం, బ్యాక్ గ్రౌండ్ చూడకుండా, ఎవరో తెలియకపోయినా, డబ్బు వస్తుందో లేదో తెలియకపోయినా, కేవలం ఆర్టిస్టుల టాలెంట్ ని చూసి ఖర్చు పెట్టేవారు మన నిర్మాతలు. సినిమా అమ్మ లాంటిది కొడుకు కూతుళ్లను వేరువేరుగా చూడదు. ఆమెకు అందరూ సమానమే. మా పిల్లలకి కూడా కులాన్ని మేము ఇవ్వము” అంటూ మనోజ్ తెలిపారు. ప్రస్తుతం మనోజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.