OTT Movie : బెంగాల్ ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఓటిటిలో కూడా ఈ సినిమాలు ఆదరగొడుతున్నాయి. ఎక్కువగా క్రైమ్ సినిమాలు అక్కడినుంచి వస్తున్నాయి. వీటిని ఇతర భాషల్లో రీమేక్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక నిధి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా స్టోరీ మొత్తం అడ్వెంచర్లతో సాగిపోతుంది. పరంబ్రత చటర్జీ హీరోగా నటించిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ బెంగాలీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
కుమార్ (రాహుల్ బెనర్జీ) తన తాత గదిలో ఒక నల్లటి మానవ తల ఎముకను గుర్తిస్తాడు. దానిపై ఒక పజిల్ చెక్కబడి ఉంటుంది. దాని అర్థంఏమిటో తెలుసుకోలేక పోతాడు. దీని గురించి అతను తన స్నేహితుడు బిమల్ (పరంబ్రత చటర్జీ), ఆంత్రోపోమెట్రీ ప్రొఫెసర్‌ను సంప్రదిస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ పజిల్‌ను అతి కష్టం మీద పరిష్కరిస్తారు. అది నియోరా వ్యాలీలోని దట్టమైన అడవుల్లో దాచబడిన ఒక పురాతన టిబెటన్ నిధికి సంబంధించిందని తెలుసుకుంటారు. ఇదే సమయంలో బిమల్ సోదరుడు హిరణ్మయ్ (కౌశిక్ సేన్) ఒక రహస్య సంస్థ చేత కిడ్నాప్ చేయబడతాడు. బిమల్ ని ఈ చర్యకు షాక్ కు గురి చేస్తుంది. ఒకవైపు నిధిని, మరోవైపు హిరణ్మయ్‌ను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి, బిమల్, కుమార్ ఒక ప్రమాదకర సాహసయాత్రను ప్రారంభిస్తారు. అయితే మరో వైపు కారాలి (సబ్యసాచి చక్రవర్తి) అనే ప్రమాదకరమైన నేరస్థుడు కూడా ఈ నిధి కోసం వెంబడిస్తాడు. బిమల్, కుమార్ తమ తెలివితేటలు ధైర్యసాహసాలను ఉపయోగించి ఆ నిధిని కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. చివరికి వీళ్ళు ఆ నిధిని కనిపెడతారా ? కారాలిని వీళ్ళు ఎలా ఎదుర్కుంటారు ? హిరణ్మయ్ ను ఎందుకు కిడ్నాప్ చేశారు ? అనే విషయాలను తెలుసుకోవాలంటే, ఈ బెంగాలీ యాక్షన్-అడ్వెంచర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒక్క మర్డర్ కేసులో ఎన్నో అనుమానాలు… ఊహకందని ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బెంగాలీ యాక్షన్-అడ్వెంచర్ మూవీ పేరు ‘జాకర్ ధన్’ (Jawker Dhan). 2017 లో వచ్చిన దీనికి సయంతన్ ఘోసల్ దర్శకత్వం వహించారు. ఇది హేమేంద్ర కుమార్ రాయ్ రాసిన ఒక సాహస కథ ఆధారంగా రూపొందింది. ఈ మూవీ బిమల్, కుమార్ అనే ఇద్దరు డిటెక్టివ్‌ల చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ట్విస్ట్ లు ఎక్కువగా ఇష్ట పడేవాళ్ళు ఈ సినిమాను మిస్ అవ్వకండి.