Manju Warrier: మంజు వారియర్.. ఈ పేరు తెలుగువారికి ఎక్కువ పరిచయం లేకపోవచ్చు. మలయాళంలో ఆమె ఒక స్టార్ హీరోయిన్. సినిమాల ద్వారా పరిచయం లేకపోయినా.. సోషల్ మీడియాలో మంజుకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. సాధారణంగా.. తెలుగులో మహేష్ బాబును, రవితేజను చూసినప్పుడు వీళ్ల ఏజ్ పెరుగుతుందా.. ? తరుగుతుందా.. ? అని అనుకోకుండా ఉండలేం.
ఇక హీరోయిన్ల విషయంలో అయితే.. మలైకా అరోరా, శిల్పాశెట్టి.. మంజు వారియర్ అని చెప్పుకోవాలి. అంతలా ఆమె ఆ ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ వస్తుంది. ఆమె ఫొటోస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం వెట్టయన్. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలోని మొదటి పాటను మేకర్స్ నిన్న రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. రజినీ- అనిరుధ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీ సినిమాలకు అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో కూడా ప్రేక్షకులు చూశారు. సాధారణంగా వీరి కాంబోలో సాంగ్ వస్తుంది అంటే.. అందరు రజినీ స్టెప్స్ కోసం, అనిరుధ్ క్యామియో కోసం ఎదురుచూస్తారు.
ఇక మనసిలాయో అంటూ సాగిన ఈ సాంగ్ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేసింది. అందుకు కారణం మంజునే. అసలు అనిరుధ్ మ్యూజిక్ ను, రజినీ స్టైల్ ను ఆమె మర్చిపోయేలా చేసింది. రెడ్ కలర్ చీరలో గాగుల్స్ పెట్టుకొని అమ్మడు మాస్ స్టెప్స్ వేస్తుంటే.. రజినీని కూడా మర్చిపోయారు ప్రేక్షకులు. ఆమెలో ఆ గ్రేస్ ను చూసి తెలుగు అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.
మంజు వయస్సు 46. ఈ వయస్సులో కూడా ఆ ఊపు.. హైప్ పెంచేలా ఆమె డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. సాంగ్ మొత్తం ఆమె కోసం చూడాలనిపించేలా ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక మంజు స్టెప్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లు కూడా ఇలాంటి వైబ్ ఇవ్వలేరని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో మంజుకు ఎలాంటి హిట్ అందుతుందో చూడాలి.