టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా సొంతం చేసుకుంది మంచు ఫ్యామిలీ(Manchu Family). క్రమశిక్షణకు మారుపేరైనా ఇప్పుడు మాత్రం ఆస్తుల తగాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఎందరికో ఆదర్శంగా నిలవాల్సిన వీరు ఇప్పుడు గొడవలతో వార్తల్లో నిలవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మంచు మనోజ్ (Manchu Manoj), మంచు విష్ణు (Manchu Vishnu) మధ్య గొడవలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ దీనిపై ఎవరు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మనోజ్ పై తన తండ్రి మోహన్ బాబు దాడి చేయడం పలు సంచలనాలకు దారితీస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మంచు విష్ణు దుబాయ్ లో ఉండగా.. ఇక్కడ మోహన్ బాబు మంచు మనోజ్ గొడవ పడ్డారు. ముఖ్యంగా మోహన్ బాబు విద్యాసంస్థలలో కీలకంగా పనిచేసే వినయ్(Vinay) అనే వ్యక్తి కొంతమంది రౌడీలతో తనపై దాడి చేశాడని గాయాలతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మంచు మనోజ్. ఆ తర్వాత తన భార్య మౌనిక రెడ్డి (Mounika Reddy)సహాయంతో హాస్పిటల్ వెళ్లి చికిత్స చేయించుకున్న ఈయన, తిరిగి జల్ పల్లి లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. తన తండ్రి ప్రమేయంతోనే వినయ్ రౌడీలతో కలిసి తనపై దాడి చేశాడని మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు ఎవరు ఈ వినయ్? తండ్రి కొడుకుల విషయంలో ఎందుకు తలదూర్చారు? అనే విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
ఎవరీ వినయ్..
అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న మంచు కుటుంబంలో గొడవ జరిగినప్పుడు.. వినయ్ తనపై దాడి చేశాడని డయల్ 100 కి కాల్ చేసి చెప్పారు మంచు మనోజ్. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ తో పాటు వినయ్ కూడా అక్కడే ఉన్నట్లు గుర్తించారు. అయితే పోలీసులతో ఫ్యామిలీ గొడవ కాబట్టి మేమే మాట్లాడుకుంటామని చెప్పడంతో పోలీసులు బయటకు వచ్చేసారట. మరి ఈ వినయ్ ఎవరో కాదు మోహన్ బాబు విద్యానికేతన్ విద్యాసంస్థలలో కీలకంగా పనిచేస్తున్నారు. వినయ్ మంచు మోహన్ బాబు ప్రధాన అధికారిగా పనిచేస్తున్నట్లు మనోజ్ స్నేహితులు తెలియజేశారు. నిన్న జరిగిన దాడుల్లో వినయ్ ఎక్కువగా తనపై దాడి చేశారని మంచు మనోజ్ తెలిపారు. ఇకపోతే తండ్రి మోహన్ బాబు పై కోపం ఉన్నప్పటికీ కూడా తనపై వినయ్ అత్యంత క్రూరంగా దాడి చేశాడు కాబట్టే మనోజ్ పై కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.
సాక్ష్యాలు ధ్వంసం చేసిన విష్ణు వ్యాపార భాగస్వామి..
ఇదిలా ఉండగా మరొకవైపు మంచు ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాదులోని జల్ పల్లిలో మంచు మనోజ్ ఇంటికి.. తన అన్న మంచు విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ (Vijay) వెళ్లారు. అక్కడ సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.అంతేకాదు మంచు మనోజ్ ఇంటిదగ్గర విష్ణుకి సంబంధించిన వ్యక్తులను కాపలాగా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక గొడవ జరిగే అవకాశం ఉందని ఆలోచించిన మనోజ్ కూడా కొంతమంది ప్రైవేటు బౌన్సర్లు తో పాటు తన స్నేహితులను కూడా పిలిపించినట్లు సమాచారం..
రూమర్స్ పై స్పందించిన మంచు విష్ణు టీమ్..
మరి కాసేపట్లో విష్ణు అమెరికా నుంచి హైదరాబాద్ కి మరి కాసేపట్లో మంచు విష్ణు చేరుకొని అక్కడినుంచి తన తమ్ముడు ఇంటికి వెళ్ళనున్నారు అంటూ వార్తలు రాగా దీనిపై మంచు విష్ణు టీం స్పందించింది. మంచు విష్ణు అధికారికంగా ప్రకటించే వరకు ఎవరు అబద్ధాలు నమ్మకండి అంటే తెలిపింది.