BigTV English

UAE Visa Indians: దుబాయ్ వీసా దొరకడం ఇక చాలా కష్టం.. భారతీయుల అప్లికేషన్లు భారీ సంఖ్యలో తిరస్కరణ

UAE Visa Indians: దుబాయ్ వీసా దొరకడం ఇక చాలా కష్టం.. భారతీయుల అప్లికేషన్లు భారీ సంఖ్యలో తిరస్కరణ

UAE Visa Indians| దుబాయ్ లో షాపింగ్ చేద్దాం. సరదాగా అరబ్బు దేశం ఎడారిలో షికారు చేయాలంటే ఇకపై చాలా కష్టపడాలి. ఎందుకంటే యుఎఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) దేశం టూరిస్ట వీసా నియమాలు ఇప్పుడు కఠినతరమయ్యాయి. దీంతో ఇటీవల దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నించే భారతీయల అప్లికేషన్లు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయి. ఇంతకుముందు 100 మంది దుబాయ్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే 99 మంది వీసా పొందేవారు. అది కూడా ఏదో అప్లికేషన్ లో పొరపాటు ఉంటేనే. కానీ ఇప్పుడు అలా కాదు.. అన్ని సవ్యంగా ఉన్నా దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసాలు ఆమోదించడం లేదని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్.


కొత్త వీసా నియమాలు ఇవే..
కొన్ని రోజుల క్రితం దుబాయ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ టూరిస్ట్ వీసాల కోసం నియమాలను కఠినతరం చేసింది.

ముఖ్యంగా దుబాయ్ పర్యటించాలనుకునేవారు. వీసా దరఖాస్తులతో పాటు ఏ హోటల్ లో స్టే చేస్తారో.. ఆ హోటల్ బుకింగ్ డాకుమెంట్స్ వాటి క్యూఆర్ కోడ్‌లు, వాటితో పాటు విమాన రిటర్న్ టికెట్లు జత చేయాలి.


ఒకవేళ హోటల్ కాకుండా బంధువుల ఇంట్లో స్టే చేయాలనుకునేవారు.. ఆ బంధువల నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.

ఇంతకుముందు ఈ పత్రాలు లేకుండానే వీసా జారీ చేసేవారు. ఒకవేళ ఈ ఆధారాలు అడిగినా వీసా జారీ చేశాక ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రమే అడిగేవారు. కానీ ఇప్పుడు ఈ పత్రాలు ముందుగానే సమర్పించాలి.. లేకపోతే వీసా లభించదు.

వీటికి తోడు దుబాయ్ ప్రయాణించాలను కునేవారు ఆర్థికశక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్నంతకాలం వారి ఖర్చులకు సరిపడ ధనం వారి అకౌంట్లో ఉన్నట్లు చూపించాలి. రెండు నెలల వీసా పొందాలనుకునేవారి బ్యాంక్ అకౌంట్లో కనీసం AED 5,000 దిర్హమ్‌లు (దాదాపు రూ.1.14 లక్షలు) ఉండాలని యుఎఈ ప్రభుత్వం కఠిన నియమం పెట్టింది.

భారీగా పెరుగుతున్న వీసాల తిరస్కరణ సంఖ్య
తాజా రిపోర్ట్ ప్రకారం.. దుబాయ్ టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసే ప్రతి 100 మంది కనీసం 6 మంది వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి. “ఇంతకుముందు దుబాయ్ వీసా తిరస్కరణ రేటు 1 లేదా 2 శాతం మాత్రమే ఉండేది. కానీ కొత్త నియమాలు వచ్చాక.. ఇప్పుడు 5 నుంచి 6 శాతం వీసా అప్లికేషన్లు ప్రతి రోజూ రిజెక్ట్ అవుతున్నాయి. అది కూడా మేము విమాన రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్ డాకుమెంట్స్ అన్నీ జతపరిచాం. అయినా తిరస్కరిస్తున్నారు.” అని పాసియో ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిఖిల్ కుమార్ తెలిపారు.

నియమాల్లో ఈ కొత్త మార్పులతో ప్రయాణికులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని నిఖిల్ చెప్పారు. ముఖ్యంగా వారు ఒకసారి వీసా ఫీజు చెల్లిస్తే.. తిరస్కరణ తరువాత అది తిరిగి రాదు. పైగా విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ రిజర్వేషన్లు రద్దు చేసుకుంటే దానిపై కూడా కొంత నష్టపోవాల్సి వస్తుంది.

Also Read: అమెరికాలో 2025 సంవత్సరానికి హెవన్‌ బి వీసా కోటా ఫుల్.. అభ్యర్థులకు మరో ఛాన్స్ లేదా?

“దుబాయ్ వెళ్లాలంటే ఇప్పుడు ముందులాగా ఈజీ కాదండి. ముందు 99 శాతం వీసా అప్లికేషన్లు ఆమోదం పొందేవి. కానీ ఇప్పుడు డాకుమెంట్స్ అన్నీ ఉన్నా రిజెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే ఇద్దరు పిల్లలు ఉన్న భార్యాభర్తలు దుబాయ్ వెళ్లాలని అన్ని డాకుమెంట్స్ కచ్చితంగా ముందే సిద్ధం చేసుకొని వీసా కోసం అప్లై చేశారు. కానీ విచిత్రంగా వారి వీసా రిజెక్ట్ అయింది.” అని విహార్ ట్రావెల్స్ డైరెక్టర్ రిషికేష్ పూజారి అన్నారు.

వీసా తిరస్కరణకు గురయ్యే అప్లికేషన్లలో ఎక్కువ ఉన్నవారు.. దుబాయ్ లోని వారి బంధువుల ఇంట్లో బస చేయాలనుకునేవారివేనని నేను గమనించాను అని హస్ముఖ్ ట్రావెల్స్ డైరెక్టర్ విజయ్ ఠక్కర్ తెలిపారు.

Tags

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×