Fear Trailer : ప్రముఖ తమిళ హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫియర్’. డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ నేను రిలీజ్ చేశారు. మరి ఆ ట్రైలర్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
వేదిక లీడ్ రోల్ పోషిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఫియర్’. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై వంకీ పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. ఈ థ్రిల్లర్ స్టోరీకి హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అరవింద కృష్ణ, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫియర్’ మూవీ రిలీజ్ కి ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70కి పైగా అవార్డులను గెలుచుకొని చరిత్రను సృష్టించింది. ఇలాంటి సినిమాను డిసెంబర్ 14న గ్రాండ్ గా ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఫియర్’ అనే టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా… మేఘన, నీల్ క్రితం పాడారు. టైటిల్ ట్రాక్‌ని ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ లిరిక్స్ మొత్తం ఇంగ్లీషులో ఉండడం విశేషం. అయితే పాటలోనే హీరోయిన్ వేదిక క్యారెక్టర్ ను ఎలాంటి భయాలు చుట్టుముట్టాయి? అనే విషయాన్ని వెల్లడించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Thrilled & happy to present the #FEAR Trailer!
Link – https://t.co/casnSIvK5k
Congratulations & best wishes to the entire team for their release.#FearOnDec14@vedhika4u #ArvindKrishna @iandrewdop @anuprubens @GogineniHaritha @DattatreyaMedia @GskMedia_PR @housefull_dgtl… pic.twitter.com/YZENb4zfea
— Ranganathan Madhavan (@ActorMadhavan) December 9, 2024
‘ఫియర్’ మూవీ ట్రైలర్ ను ప్రముఖ తమిళ హీరో మాధవన్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో హీరోయిన్ చిన్నప్పటి నుంచే బూచి అంటే భయపడడం, నిజంగానే బూచి ఉంటుందా ? అని తన పేరెంట్స్ ని ప్రశ్నించడం చూస్తుంటే… ఆ బూచి అనే పదం ఆమెపై ఎంతగా ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక అంతే కాకుండా హీరోయిన్ ట్రైలర్ లోని ప్రతి సీన్లోనూ తనకు తెలియకుండా తన చుట్టూ ఏదో జరుగుతోందని భయపడడం, ఎవరో తనను వెంటాడుతున్నట్టుగా ఊహించుకోవడం కనిపిస్తోంది. అయితే చివర్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. హీరోయిన్ ద్విపాత్రాభినయం చేయబోతుందని చెప్పేశారు. అక్క పాత్రలో వేదిక సింపుల్ గా ఉంటే, చెల్లి పాత్రలో మాత్రం చాలా మోడరన్ లుక్ లో కనిపించింది. అంతేకాకుండా ఒకరు పిచ్చి ఆసుపత్రిలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా చూపించారు. హీరోయిన్ మరో పాత్రలో సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ట్రైలర్లో కనిపిస్తోంది.
అంతేకాకుండా ట్రైలర్ మొదట్లోనే ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయి అనే విషయాన్ని వెల్లడించారు మేకర్స్. మరి ఈ రెండు పాత్రల స్టోరీ ఏంటి? హీరోయిన్ కి ఇలాంటి భయాలు ఎందుకు ఉన్నాయి? చివరికి ఈ అక్కా చెల్లెల్ల స్టోరీ ఎక్కడకు చేరింది? అనే విషయం తెలియాలంటే ‘ఫియర్’ మూవీని తెరపై చూడాల్సిందే.