Unni Mukundan : “హెల్ప్ లెస్ గా ఉన్నాను” అంటూ తాజాగా మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. “అలాంటి పని మాత్రం చేయొద్దు” అంటూ అభిమానులను వేడుకున్నారు ఆయన. మరి ఈ హీరోను ఇంతగా బాధపెడుతున్న ఆ విషయం ఏంటి అంటే…
హనీఫ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన మూవీ ‘మార్కో’ (Marco). ఇందులో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించగా, గత నెలలో మలయాళంలో రిలీజ్ అయింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అక్కడ ఘన విజయాన్ని అందుకుని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. 30 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పటిదాకా 80 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రతీకారం, హింస వంటి అంశాలే ప్రధానాంశాలుగా తెరకెక్కిన ‘మార్కో’ మూవీ కథంతా డబ్బున్న ఒక పెద్ద ఫ్యామిలీ, వాళ్ల పెంపుడు వారసుడి చుట్టే నడుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా కొన్ని పైరసీ సైట్లలో లీక్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో హీరో ఉన్ని ముకుందన్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఈ విషయం తమను బాధించిందని వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాలో ఓ పోస్ట్ చేస్తూ, పైరసీని ప్రోత్సహించొద్దంటూ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు.
ఆ పోస్టులో ఉన్ని ముకుందన్ (Unni Mukundan) “పైరసీని దయచేసి చూడొద్దు. ప్రస్తుతం మేము హెల్ప్ లెస్ సిచువేషన్ లో ఉన్నాము. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రేక్షకులు మాత్రమే ఈ పైరసీని అరికట్టగలరు. ఆన్లైన్లో సినిమాలు చూడడం, డౌన్లోడ్ చేయడం వంటివి దయచేసి ఆపండి. ఇదే మా రిక్వెస్ట్” అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఆయన పోస్టు చూసిన అభిమానులు రియాక్ట్ అవుతూ, ఈ విషయంలో ఉన్ని ముకుందన్ కే సపోర్ట్ చేస్తున్నారు. ‘మార్కో’ మూవీ పైరసీ వెర్షన్ కాకుండా థియేటర్లలో చూస్తేనే మంచి కిక్ వస్తుందని ఇప్పటికే సినిమాలు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఉన్ని ముకుందన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే ఆయన అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ‘భాగమతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మార్కో’ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్ జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా తెలుగులో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే మూవీ లీక్ అయిందంటూ, “పైరసీ వర్షన్ మాత్రం చూడొద్దు” అంటూ ఉన్ని ముకుందన్ రిక్వెస్ట్ చేయడం గమనార్హం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఇక ‘మార్కో’ మూవీ స్టోరీ విషయానికి వస్తే… అడట్టు అనే ఫ్యామిలీ తమ వారసుడిగా ‘మార్కో’ను పెంచుకుంటుంది. అయితే హీరో విషయంలో ఆ ఫ్యామిలీ మొత్తం ఒక్క మాట మీద మాత్రం ఉండదు. విబేధాలు ఉన్నప్పటికీ ఆ ఫ్యామిలీ పెద్ద కొడుకైన జార్జ్, తన సొంత తమ్ముడు విక్టర్ మాత్రం తమతో సమానంగా మార్కోను చూసుకుంటారు. మార్కో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే విక్టర్ ను యాసిడ్ పోసి చంపేస్తారు. అలా చంపింది ఎవరు? మార్కో ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.