BigTV English

Diabetes: ఇవి తింటే.. షుగర్ గ్యారంటీ !

Diabetes: ఇవి తింటే.. షుగర్ గ్యారంటీ !

Diabetes: ఈ రోజుల్లో షుగర్ వ్యాధి బారిన పడే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. దాదాపు ప్రతీ ఇంట్లో షుగర్ రోగులు ఉంటున్నారనడంతో అతిశయోక్తి లేదు. మధుమేహాన్ని జీవనశైలి సంబంధిత వ్యాధి అంటారు. అంటే మన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు దీనికి కొంతవరకు కారణం అవుతాయి.


డయాబెటిస్‌లో మన శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. అంతే కాకుండా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతుంది. దీని కారణంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంతో పాటు ఇన్సులిన్ నిరోధకతను పెంచే అనేక ఆహార పదార్థాలను మనం ప్రతిరోజు తీసుకుంటాము. మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మధుమేహాన్ని కలిగిస్తాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు తినే ఈ 5 పదార్థాలు మిమ్మల్ని డయాబెటిస్ పేషెంట్‌గా మారుస్తాయి. ఈరోజే వాటికి దూరంగా ఉండండి. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.


కూల్ డ్రింక్స్:
మీరు తరుచుగా కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సోడా లేదా క్యాన్డ్ జ్యూస్‌లు వంటివి తాగితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి వీటిలో ఎక్కువ మొత్తంలో చక్కెర, కేలరీలు ఉంటాయి. వీటిలో పోషక విలువ ఉండవు. తరుచుగా వీటిని త్రాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఇన్సులిన్ నిరోధకత కూడా పెరుగుతుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మూడు అంశాలు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.

వేయించిన ఆహారం:
మీకు ఆకలిగా అనిపించినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్,పకోడాలు,ఫ్రైడ్ చికెన్ మరేదైనా వేయించిన చిరుతిండిని మీరు తరచుగా తినాలనుకుంటే మీ ఈ అలవాటు మిమ్మల్ని డయాబెటిక్ పేషెంట్‌గా మార్చగలదు. ఈ వేయించిన ఆహారాలలో పెద్ద మొత్తంలో అనారోగ్యకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. ఈ రెండూ శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. ఇది మధుమేహం రూపంలో బయటకు వస్తుంది.

స్వీట్లను తినడం తగ్గించండి:

కొంతమందికి స్వీట్లను చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా తరుచుగా స్వీట్లను తింటే గనక మీ అలవాటును వీలైనంత త్వరగా మార్చుకోండి. నిజానికి తరుచుగా ఐస్‌క్రీం, మిఠాయిలు, స్వీట్లు లేదా ఏదైనా చిరుతిండి వంటి తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరుగుతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బంగాళదుంపలను పరిమితంగా తినండి:
బంగాళాదుంపలను పరిమితంగా తీసుకోవడం మంచిది. లేకుంటే అది మీకు మధుమేహాన్ని కలిగిస్తుంది. నిజానికి, బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.తరుచుగా బంగాళదుంప తింటే మాత్రం ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. చివరికి మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Also Read: టీ త్రాగేటప్పుడు ఇవి అస్సలు తినకూడదు !

తక్కువ శుద్ధి చేసిన ధాన్యాలను తినండి:

ప్రతిరోజు శుద్ధి చేసిన ధాన్యాలు, వాటి ఉత్పత్తులైన తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, శుద్ధి చేసిన పిండితో చేసిన పదార్థాలను తింటాము. శుద్ధి చేసిన ధాన్యాలు ఎక్కువ ప్రాసెసింగ్ చేసిన తర్వాత తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఫైబర్ తో పాటు ఇతర పోషకాలు పోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడానికి ఇది దారితీస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. అంతే కాకుండా మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×