BigTV English

Prabhas: 17 ఏళ్ల తర్వాత నయన్‌తో డార్లింగ్ రొమాన్స్.. మారుతి రొమాంటిక్ ప్లాన్ ఇదే..

Prabhas: 17 ఏళ్ల తర్వాత నయన్‌తో డార్లింగ్ రొమాన్స్.. మారుతి రొమాంటిక్ ప్లాన్ ఇదే..

Prabhas : ఒక హీరో, హీరోయిన్ హిట్ పెయిర్ అనిపించుకున్నా కూడా మరోసారి వారు కలిసి నటించడానికి చాలా సమయమే పడుతుంది. పలు కారణాల వల్ల మరోసారి వారు స్క్రీన్‌పై కలిసి కనిపించకపోవచ్చు. అలా ప్రభాస్ (Prabhas), నయనతార (Nayanthara) కూడా మంచి పెయిర్ అనిపించుకున్నారు. 17 ఏళ్ల క్రితం విడుదలయిన ‘యోగి’లో వీరిద్దరూ కలిసి కనిపించారు. ప్రభాస్ కెరీర్ మొదట్లోనే ఈ సినిమాలో నయనతారతో జోడీకట్టాడు. నయనతారకు కూడా అప్పటికీ తెలుగులో అంత ఆదరణ లేదు. కానీ ఇప్పుడు వీరిద్దరి రేంజే మారిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ప్రభాస్, నయనతార జోడీ కడుతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


నమ్మకం వచ్చింది…

ప్రస్తుతం ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందుకే తను నటిస్తున్న సినిమాల స్కేల్, బడ్జెట్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటినుండి ప్రభాస్ నటించాలంటే కనీసం ప్యాన్ ఇండియా రేంజ్ కాన్సెప్ట్ కావాలి. అలాంటి సమయంలో మారుతి లాంటి చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడితో మూవీ ఓకే చేశాడు ప్రభాస్. దీంతో ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. అసలు ప్రభాస్ స్టార్‌డమ్‌ను మారుతి ఎలా తట్టుకోగలడా అని సందేహం వ్యక్తం చేశారు. కానీ మారుతి మాత్రం కచ్చితంగా ప్రభాస్‌తో తను చేసే సినిమా బాగుంటుందని ఫ్యాన్స్‌కు నమ్మకం ఇచ్చాడు. ‘రాజా సాబ్’ గురించి ఈ దర్శకుడు ఇచ్చిన అప్డేట్స్ కూడా ఫ్యాన్స్‌లో నమ్మకం వచ్చేలా చేశాయి. తాజాగా వారికోసం మరొక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు.


Also Read: డార్లింగ్ గురించి ఎవరికీ తెలియని 10 రహస్యాలు ఇవే..!

మోషన్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్…

సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్న సమయంలోనే ‘రాజా సాబ్’కు సంబంధించిన పోస్టర్ విడుదలయ్యింది. కొన్నాళ్ల క్రితం ఒక గ్లింప్స్ కూడా బయటికొచ్చింది. అందులో డార్లింగ్ లుక్స్ ఫ్యాన్స్‌ను ఫుల్ హ్యాపీ చేశాయి. ‘రాజా సాబ్’ (The Raja Saab) మూవీ హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతుందని ఇప్పటికీ ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదలయిన మోషన్ పోస్టర్‌లో ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాడు మారుతి. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ రోల్ అని.. యంగ్‌గా మాత్రమే కాకుండా వృద్దుడిగా కూడా కనిపించనున్నాడని మోషన్ పోస్టర్‌తో స్పష్టమయ్యింది. ఇది మాత్రమే కాదు.. ప్రభాస్ కోసం ఏకంగా నయనతారను రంగంలోకి దించనున్నాడు దర్శకుడు.

మంచి ర్యాపో…

‘రాజా సాబ్’లో నయనతారతో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట దర్శకుడు మారుతి. నయనతార తెలుగులో సినిమా చేసి చాలాకాలమే అయ్యింది. ప్రస్తుతం తను తమిళంలో హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాత కూడా బిజీ అయ్యింది. ఇంతలోనే ‘రాజా సాబ్’లో నయనతార స్పెషల్ సాంగ్ చేస్తుంది అనగానే తన తెలుగు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటివరకు నయనతార కెరీర్‌లో అసలు ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు. కానీ ప్రభాస్‌తో, మారుతితో మంచి ర్యాపో ఉండడంతో ‘రాజా సాబ్’లో చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ అనే మూవీలో నటించింది నయనతార.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×