BigTV English

Mastan Sai: విచారణలో విస్తుపోయే నిజాలు.. లావణ్య చెప్పిందంతా నిజమేనా..?

Mastan Sai: విచారణలో విస్తుపోయే నిజాలు.. లావణ్య చెప్పిందంతా నిజమేనా..?

Mastan Sai: గత ఏడాది కొన్ని నెలల క్రితం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) , లావణ్య (Lavanya) మధ్య చెలరేగిన వివాదం. ముఖ్యంగా తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని, తనతో పదేళ్లు సహజీవనం చేసి, గర్భవతిని చేసిన తర్వాత అబార్షన్ కూడా చేయించాడు.. అంటూ లావణ్య తన గోడును వెల్లబుచ్చుకుంది. ఇక ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి వారి మిత్రుడైన మస్తాన్ సాయి (Mastan Sai) వరకు చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులు హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై ఎటువంటి అప్డేట్లు రాలేదు. దీంతో సమస్య సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇటీవల మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టడంతో మరొకసారి వీరి వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. మస్తాన్ సాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, డ్రగ్స్ కిన్ అలవాటు చేసి, వీడియోలు తీసాడని, తన ఫిర్యాదులో పేర్కొన్న లావణ్య, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న తన వీడియోలను డిలీట్ చేయాలని అనుకున్నప్పుడు.. అందులో వందల మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని గుర్తించి, వెంటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు.


పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించిన మస్తాన్ సాయి..

మస్తాన్ సాయికి కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని చంచల్గూడా జైలుకి తరలించారు నార్సింగ్ పోలీసులు. ఇకపోతే మూడు రోజులపాటు పోలీసుల కస్టడీలో ఉన్న మస్తాన్ సాయిని విచారణ జరపగా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టి, అటు పోలీసులను సైతం ఆశ్చర్యపరిచారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోల గురించి పోలీసులు అడగగా.. ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియోలు తీసానని పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడట. అందులో భాగంగానే అమ్మాయిల కోసం పార్టీలు ఏర్పాటు చేసి, వారికి మత్తు అలవాటు చేశానని, వారు మత్తులో ఉన్నప్పుడు వారిపై అత్యాచారం చేసి, ఆ వీడియోలు తీశాను అని పోలీసుల విచారణలో మస్తాన్ సాయి తెలిపినట్టు సమాచారం. అంతేకాదు ఆ వీడియోల ద్వారా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకునేవాడిని అంటూ మస్తాన్ సాయి అంగీకరించారట. మస్తాన్ సాయి నేరాలు ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య చెప్పిందంతా నిజమే అని అందరూ ఒక నిర్ధారణకు వస్తున్నట్లు సమాచారం.


డ్రగ్స్ దందాపై క్లారిటీ ఇచ్చిన మస్తాన్ సాయి..

అలాగే డ్రగ్స్ గురించి వివరిస్తూ.. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తాను. కానీ వాటిని ఎవరికీ సరఫరా చేయలేదు. నేను చేసుకునే పార్టీ కోసమే వాటిని ఉపయోగించే వాడిని. ఇక లావణ్య విషయానికి వస్తే.. ఆమెకు పలుమార్లు డ్రగ్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాను అని మస్తాన్ సాయి అంగీకరించారట. అయితే ఆమెను బలవంతం చేయలేదని, ఆమె అంగీకారంతోనే ఆ పని చేశానని కూడా చెప్పినట్లు సమాచారం. ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. పోలీసుల విచారణకు మస్తాన్ సాయి పూర్తిగా సహకరించడమే కాకుండా వారు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మూడో రోజుల కస్టడీ ముగియడంతో మళ్ళీ అతడిని చంచల్గూడా పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించినట్లు సమాచారం. ఏది ఏమైనా సొంత లాభార్జన కోసం ఇంత మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడంపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×