Manshi Joshi:ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు ఏడు అడుగులు వేస్తున్నారు. కొంతమంది ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే.. మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం తన ప్రేయసి డాక్టర్ ధన్యత తో ఏడడుగులు వేశారు ‘పుష్ప’ నటుడు డాలీ ధనుంజయ్ (Dhanunjay). అలాగే ప్రముఖ మలయాళ హీరోయిన్ పార్వతి నాయర్ (Parvati Nair) కూడా తనకు నచ్చిన వాడిని వివాహం చేసుకుంది. చెన్నైకి చెందిన బిజినెస్ మాగ్నెట్ ఆశ్రిత్ అశోక్ (Ashrith Ashok) తో ఏడడుగులు వేసింది పార్వతి నాయర్. అయితే ఇప్పుడు మరో బుల్లితెర నటి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఆమె ఎవరో కాదు దేవత సీరియల్ నటి మాన్షి జోషి (Manshi Joshi). తాజాగా ఈమె వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర నటి..
బుల్లితెర సీరియల్స్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. గత ఏడాది అక్టోబర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవ్ (Raghav) తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్గా బెంగళూరులోని ఒక ఫంక్షన్ హాల్ లో వీరి పెళ్లి వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ తారలు, సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పలువురు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాన్షికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
మాన్షి కెరియర్..
మాన్షి జోషి కెరియర్ విషయానికి వస్తే.. కన్నడ సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇక ఈమె తెలుగులో దేవత అనే సీరియల్ లో కూడా కనిపించింది. ఈ సీరియల్ లో అర్జున్ అంబటి(Arjun Ambati), చంటిగాడు హీరోయిన్ సుహాసిని(Suhasini ) కీలకపాత్రను పోషించిన విషయం తెలిసిందే ఇక ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సీరియల్ ద్వారా అటు సుహాసినికి ఇటు మాన్షి కి మంచి పేరు లభించింది. ఈ సీరియల్ తో పాటు కన్నడలో చాలా సీరియల్స్ లో నటించి మంచి ఫేమ్ దక్కించుకుంది మాన్షి జోషి. ఒక కన్నడలో ఈమె నటించిన సీరియల్స్ విషయానికి వస్తే.. ‘పారు’ అనే సీరియల్ ద్వారా భారీ ఇమేజ్ దక్కించుకున్న మాన్షి, రాధా రమణ, గీతాంజలి, రాధా రాఘవ్, అంబుధాన్ ఖుషీ వంటి సీరియల్స్ లో నటించింది. కర్ణాటకలోని బెంగళూరులో సెప్టెంబర్ ఐదున మాన్షి జన్మించింది. ఈమెకు ఒక సోదరి ఉండగా.. ఆమె కూడా బుల్లితెర కన్నడ సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తోంది. మాన్షి సోదరి తెలుగులో ప్రసారమైన ‘అరవింద సమేత’ అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. స్కూలింగ్ అలాగే విద్యాభ్యాసం కర్ణాటకలోనే పూర్తి చేసిన ఈమె చిన్నప్పటినుంచే డాన్స్ పై మక్కువ చూపింది. ఆ తర్వాత మోడల్ గా తన కెరీర్ ను మార్చుకుంది. ఇక గత ఏడాది మొదలైన ‘అన్నా తంగి’ అనే కన్నడ సీరియల్ లో నటిస్తోంది మాన్షి. ఇక ఇప్పుడు ఏడు అడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. అయితే ఈమెది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా ? అన్నది తెలియాల్సి వుంది.