Akhil Akkineni – RCB: కెరీర్ ప్రారంభం నుండి ఓ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు అక్కినేని వారసుడు అఖిల్. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎంతగా శ్రమించినా.. ఆశించిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 11 ఏళ్లవుతుంది. ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఇండస్ట్రీపై గజినీలా దండయాత్ర చేస్తున్నప్పటికీ.. బ్లాక్ బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు.
Also Read: Indian Team Matches: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మ్యాచ్ ల టైమింగ్స్, ఫ్రీగా ఎలా చూడాలి ?
అఖిల్ చివరిగా నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. తన సోదరుడు నాగచైతన్యలాగా వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అఖిల్ మాత్రం ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు క్రికెట్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలై రెండేళ్లు గడుస్తోంది. అప్పటినుండి మరే సినిమా గురించి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం క్రికెట్ మీద ఫోకస్ చేశాడు అఖిల్.
సెలబ్రిటీ క్రికెట్ {సిసిఎల్} లో పాల్గొని అదరగొడుతున్నాడు. అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే అఖిల్ కెప్టెన్సీలో తెలుగు వారియర్స్ రెండుసార్లు కప్ అందుకుంది. చివరిసారి దుబాయ్ వేదికగా జరిగిన పదవ సీజన్ లో ఫైనల్ వరకు వచ్చి ఓడిపోయింది తెలుగు వారియర్స్. ఇక ఈ 11వ సీజన్ లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు అఖిల్. అయితే అభిమానులు కూడా అఖిల్ ని స్టార్ హీరోగా కాకుండా.. ఓ స్టార్ క్రికెటర్ గా చూడాలని కోరుకుంటున్నారు.
బాక్సాఫీస్ వద్ద ఎలాగో సినిమాలు హిట్ కావడం లేదని.. గ్రౌండ్ లో సిక్సులతో అఖిల్ అదరగొడుతున్న నేపథ్యంలో అతడు పూర్తి క్రికెటర్ గా మారాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇకనుండి అఖిల్ సినిమాల కంటే క్రికెట్ పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ఫ్రాంచైజీ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి} జెర్సీని అఖిల్ ఫోటోకి ఎడిట్ చేసి క్రియేట్ చేశారు.
Also Read: JP Duminy Divorce: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని విడాకులు.. 13 ఏళ్ళ తర్వాత !
ఇలా క్రియేట్ చేసిన ఫోటోలో అక్కినేని అఖిల్ ఆర్సిబి జెర్సీలో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు ఎందుకని మీరు ఆర్సీబీలో చేరి కెప్టెన్ అవ్వకూడదు అని కామెంట్స్ చేస్తున్నారు. అయ్యగారు ఆర్సిబి కెప్టెన్ అనే ఊహ ఎంత బాగుందోనని సంబరపడిపోతున్నారు ఆయన అభిమానులు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు యాజమాన్యం ఇటీవలే ఆ జట్టు కెప్టెన్ గా రజత్ పటిదార్ ని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు బెంగుళూరు కెప్టెన్ అక్కినేని అఖిల్ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీగా మీమ్స్ చేయడంతో.. రజత్ పాటిదార్ షాక్ కి గురయ్యారంటూ ఫన్నీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.