BigTV English

Mathu Vadalara 2 Collections : రిలీజై 5 రోజులు అయింది.. మరి కలెక్షన్లతో మత్తు వదిలించారా..?

Mathu Vadalara 2 Collections : రిలీజై 5 రోజులు అయింది.. మరి కలెక్షన్లతో మత్తు వదిలించారా..?

Mathu Vadalara 2 Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహా రీసెంట్ మూవీ మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి షోతోనే అదిరిపోయిందనే టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ రోజు కూడా మత్తు వదలరా 2 చిత్రానికి థియేటర్లలో మంచి రెస్సాన్స్ లభించింది. ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఐదు రోజులకు గాను ఈ సినిమా ఎంత కలెక్షన్ వసూల్ చేసిందో ఒక్కసారి తెలుసుకుందాం..


2018 లో చిన్న సినిమాగా వచ్చి భారీ అంచనాలను అందుకున్న సినిమాలలో మత్తు వదలరా కూడా ఒకటి.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేలా కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 సినిమా వచ్చింది. మొదటి పార్ట్ కన్నా రెండో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సత్య కామెడీ ట్రాక్ వర్కవుట్ కావడంతో మత్తు వదలరా 2 చిత్రానికి అనూహ్యమైన స్పందన సినీ, క్రిటిక్స్, సాధారణ ప్రజల నుంచి వస్తున్నది. ఈ క్రమంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడమే కాకుండా 4 వ రోజునే బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది.. ఇక ఐదో రోజు కూడా కలెక్షన్స్ మోత మోగిపోతుంది..

Mathu Vadalara 2 5days box office Collections
Mathu Vadalara 2 5days box office CollectionsMathu Vadalara 2 5days box office Collections

మత్తు వదలరా 2 సినిమా కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 2.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.2 కోట్లు, మూడో రోజు 3.5 కోట్ల రూపాయలు, 4వ రోజు ఈ సినిమా 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా సుమారుగా 11 కోట్ల రూపాయల వసూల్ ను రాబట్టింది. ఇక ఈరోజు కలెక్షన్స్ కూడా బాగా వచ్చినట్లు తెలుస్తుంది. 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఇండియాలో 12.5 కోట్లు, నార్త్ అమెరికాలో 6.35 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా సుమారుగా 19 కోట్లు రాబట్టడం మాటలు కాదు. అటు ఓవర్సిస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను రాబట్టినట్లు తెలుస్తుంది. ఈ నెల చివర దేవర సినిమా వచ్చేవరకు కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..


శ్రీ సింహా ఇప్పటివరకు చేసిన సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకోవడం తో నెక్స్ట్ భారీ ప్రాజెక్టులలో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. త్రివిక్రమ్ , అనిల్ రావిపూడి వంటి స్టార్స్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో చూడాలి.. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×