BigTV English

Meenakshi Chaudhary: లక్కీ బ్యూటీని అలా ఎలా చేశారు.. ఆమె కోసమే మట్కా చూసేవాళ్ల పరిస్థితి ఏంటి.. ?

Meenakshi Chaudhary: లక్కీ బ్యూటీని అలా ఎలా చేశారు.. ఆమె కోసమే మట్కా చూసేవాళ్ల పరిస్థితి ఏంటి.. ?

Meenakshi Chaudhary: ఇచట వాహనములు నిలుపరాదు అనే  సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల బొమ్మ మీనాక్షీ చౌదరీ.  సినిమా ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయినా.. అమ్మడి అందానికి  మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఆ తరువాత రవితేజతో కలిసి ఖిలాడీ చేసింది. అది అయితే డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. అయినా సరే అమ్మడికి ఛాన్స్ లు క్యూ కట్టాయి. అమ్మడి జీవితాన్ని మార్చేసిన సినిమా అంటే గుంటూరు కారం అనే చెప్పాలి. అదేంటి ఆ సినిమాలో ఆమె హీరోయిన్ గా కనిపించింది కొద్దిసేపే కదా.. అని అంటారేమో.


మీనాక్షీ కనిపించింది కొద్దిసేపే అయినా.. అందరి చూపు ఆమె మీదనే పడింది. శ్రీలీల కన్నా మీనాక్షీనే హీరోయిన్ గా కనిపించిందని చెప్పుకొచ్చారు. ఎలారా ఆమెను హీరోయిన్ గా తీసుకోలేదని ప్రశ్నించారు. ఇక ఈ సినిమా ఇచ్చిన హైప్ తో అమ్మడికి వరుస సినిమాలు క్యూ కట్టాయి. అందులోవే లక్కీ భాస్కర్, మట్కా  సినిమాలు. లక్కీ భాస్కర్ సినిమాతో ఎట్టకేలకు ఈ చిన్నది లక్కీ బ్యూటీగా మారింది. ఇన్నాళ్లకు మీనాక్షీకి మంచి హిట్ పడింది.

Rajinikanth: మామ ఆఖరి కోరిక తీర్చిన అల్లుడు.. భార్యతో కలిసిపోయిన ధనుష్.. ?


సుమతి పాత్రలో మీనాక్షీ నటనకు ఫిదా కానివారుండరు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆమె పాత్రకు ఎంతో కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. ఇక  ఈ సినిమా తరువాత  మీనాక్షీ నటించిన మరో చిత్రం మట్కా. వరుణ్ తేజ్ హీరోగా  నటించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 14 న  ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇందులో వరుణ్.. వాసు పాత్రలో నటిస్తుండగా.. అతని భార్య సుజాతగా మీనాక్షీ  నటిస్తుంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం..  ఈ సినిమా సగంలోనే మీనాక్షీ చనిపోతుందని సమాచారం. వాసు అనే ఒక సాధారణ కుర్రాడు మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు.. ? ఆ ఎదిగే సమయంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు.. ? అనేది  సినిమా. ఇక వాసు మీద పగతో సుజాతని విలన్స్ ను చంపేశారా.. ? లేక వేరే కారణాల వలన సుజాత చనిపోతే వాసు.. ఆ బాధతో ఇలా మారాడా.. ? అనేది  సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Srikanth odela with Nani : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమా టైటిల్ ఇదే అంట

కానీ, సినిమా సగంలోనే మీనాక్షీ పాత్ర చనిపోతే.. ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తారని టాక్ నడుస్తోంది. ఆమె కోసం వచ్చిన ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి.. ? అలా ఎలా సుజాత పాత్రను  డిజైన్  చేశారు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక గత కొన్నేళ్లుగా హిట్  అందుకొని వరుణ్ తేజ్ కు ఈ లక్కీ బ్యూటీ వలన లక్కు కలిసి వచ్చి హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×