BigTV English
Advertisement

Srikanth odela with Nani : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమా టైటిల్ ఇదే అంట

Srikanth odela with Nani : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమా టైటిల్ ఇదే అంట

Naniodela 2 Movie Title : మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం చాలు అని అంటుంటారు చాలామంది. ఒకే ఒక అవకాశంతో తనేంటో పాన్ ఇండియా స్థాయిలో తెలిసేలా చేశాడో ఓ దర్శకుడు అతనే శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా దసరా (Dasara) అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్. ఈ సినిమా నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద నాని సత్తా ఏంటో తెలిసేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ కి వరుసగా అవకాశాలు వచ్చినా కూడా మళ్లీ నానితోనే సినిమా చేయడానికి ముందడుగు వేశాడు. శ్రీకాంత్ ప్రస్తుతం నానితో సినిమాను చేయబోతున్నాడు.


ఇక దసరా సినిమాకి సంబంధించి శ్రీకాంత్ కి మొదటి సినిమా అయినా కూడా నిర్మాత హైటెక్నిషన్స్ ని తీసుకొచ్చి ఇచ్చాడు. దసరా సినిమాకి సంతోష్ నారాయణన్ (Santhosh Narayan) సంగీత దర్శకుడుగా కావాలని అడిగాడు శ్రీకాంత్. మొదటి సినిమా అయినా కూడా ఆ స్థాయి సంగీత దర్శకుని తీసుకొచ్చి శ్రీకాంత్ కి అందించారు అదే స్థాయిలో సంతోష్ నారాయణ కూడా సినిమాకు న్యాయం చేశాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. వెన్నెల అనే పాత్రలో కీర్తి సురేష్ (Keerthi Suresh) విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మొదటి షో పడినప్పటినుంచి విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

Also Read: Suriya: రోలెక్స్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రీవిల్ చేసిన సూర్య


శ్రీకాంత్ దర్శకత్వంలో నాని చేయబోయే సినిమాకి సంబంధించి “పారడైజ్” (Paradise) అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో నాని ఇదివరకే చాలా ఇంటర్వ్యూస్ లో చెబుతూ వచ్చాడు. ఇక దసరా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాను మించి ఈ సినిమా ఉంటుంది. అని నాని పలు సందర్భాల్లో చెప్పినప్పుడు ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత, మళ్లీ శ్రీకాంత్ దర్శకత్వం చేయబోయే సినిమాకు సిద్ధమవుతున్నాడు.

Also Read: Rana comments on Mr Bachchan: లాస్ట్ కి అవార్డు తీసుకునే స్టేజ్ మీద కూడా హరీష్ శంకర్ ని ట్రోల్ చేశారు

అయితే ఇప్పుడు శ్రీకాంత్ నానితో చేయబోయే సినిమాకి దేవిశ్రీప్రసాద్ ను సంగీత దర్శకుడుగా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా కూడా ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ని ఎంచుకోవడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే దేవిశ్రీప్రసాద్ ఇంతకుముందు తక్కువ కొట్టలేదు. కొన్ని సినిమాల్లో దేవిశ్రీప్రసాద్ మార్క్ క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇకపోతే శ్రీకాంత్ ఓదెల అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రంగస్థలం సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×